Telugu News

రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్లు వీరే..

** అన్ని వర్గాల వారికి ప్రీయార్టి ఇచ్చిన సీఎం కేసీఆర్

0

రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్లు వీరే..
** అన్ని వర్గాల వారికి ప్రీయార్టి ఇచ్చిన సీఎం కేసీఆర్
(హైదరాబాద్-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో నామినేటేడ్ పదవుల పందెరకు ఊపందుకుంది.. ఇప్పటి వరకు పదవులు లేక పార్టీలో కొనసాగుతున్న నాయకులకు, ప్రతినిధులకు సీఎం కేసీఆర్ వివిధ కార్పోరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఐదుగురికి రాష్ట్ర కార్పోరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్హులు జారీ చేశారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్” చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితలను నియమించారు. ఈమే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్సీ టిక్కెట్ వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యింది. ఎమ్మెల్యే నామినేటేడ్ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ వస్తుందని భావించినప్పటికి అవకాశం రాలేదు. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన ఇస్తారని భావించారు. కానీ సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో ఆయన కూతురు కల్వకుంట్ల కవితకు అవకాశం కల్పించారు. దీంతో రెండుసార్లు రేసులో ఉండి అవకాశం లేకపోవడంతో ఆమెకు తెలంగాణ ఉమెన్స్ పైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించారు. అలాగే మరో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్” చైర్మన్ గా గజ్జెల నగేష్ నియమించారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్” చైర్మన్ గా పాటిమీది జగన్ మోహన్ రావును నియమించగా, తెలంగాణ ఉద్యమానికి నాంధిగా ఎన్నో పాఠలను రచించి కవిత్వాలతో, మాటలతో ఉద్యమాలు చేసిన సిని, జానపద గేయ రచయత జూలరి గౌరీశంకర్ కు తెలంగాణ సాహిత్య అకాడమీ” చైర్మన్ గా నియమించారు. తెలంగాణ ఉద్యమకారుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్” చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్హులు జారీ చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి అభినందనలు తెలిపారు. కాగా చైర్మన్లుగా నియమించబడిన నాయకులు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి :- సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన తాతామధు