Telugu News

తెలంగాణ ఉద్యమకారుడు.. దబ్బెటి.మహేష్ మృతి..

మహబూబాబాద్ విజయం న్యూస్

0

తెలంగాణ ఉద్యమకారుడు.. దబ్బెటి.మహేష్ మృతి..

(మహబూబాబాద్ విజయం న్యూస్)

మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, కాకతీయ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ సాదనకోసం అనేక పోరాటాలు నిర్వహించిన విద్యార్దినాయకుడు దబ్బెటి.మహేష్ యంజియం ఆసుపత్రిలో పొందుతూనే గురువారం తెల్లవారుజామున మృతిచెందారు.సుమారు యాబైరోజుల క్రితం మహేష్ కరోనా బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో అతనిని వరంగల్ ఎంజీఎం కు తరలించారు. నలబైరోజులుగా మహేష్ అక్కడే చికిత్స పొందుతున్నారు. కరోనానుండి కోలుకున్నప్పటికి ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోవడంతో ఈ..పరిస్థితి ఏర్పడింది. మంత్రి కేటీఆర్ మహేష్ విషయంలో స్పందించి నిమ్స్ కు తరలించాలని చెప్పినా వెంటిలేటర్ పై ఉన్న అతనిని ఇప్పుడు షిప్ట్ చేయడం తగదని వైద్యులు చెప్పడంతో ఆ..ప్రయత్నం విరమించుకున్నారు. మానుకోట యంపి మాలోత్.కవిత, ఎమ్మెల్యేలు పెద్ది.సుదర్శన్ రెడ్డి, వినయ్ బాస్కర్ తదితరులు కొంత ఆర్థికసహాయం చేయడంతోపాటు ఆ..కుటుంబానికి దైర్యం చెప్పే ప్రయత్నం చేసారు.

మహేష్ కోలుకుంటాడని అంతా బావించిన సమయంలో గురువారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచాడు.ఆయన కాకతీయయూనివర్సిటీలో పిజి, పిహెచ్ డి పూర్తిచేయడంతోపాటు, తాత్కాలిక బోదకునిగా కూడా పనిచేసారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకభూమికను యూనివర్సిటీలో నిర్వహించి రాష్ట్రస్థాయిలో విద్యార్ధి ఉద్యమకారునిగా మహేష్ మంచి పేరు సంపాదించుకున్నారు. నాలుగు పదుల వయస్సులోనే మహేష్ కన్ను మూయడంతో ఆ..కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. ఆసరా అవుతారనుకుంటే ఇద్దరు అర్ధాంతరంగా కన్నుమూసారు.కురవి మండల కేంద్రానికి చెందిన దళిత కుటుంబానికి చెందిన మహేష్ తండ్రి దబ్బెటి.సీతయ్య మొదటి నుండి కొంత అభ్యుదయ ఆలోచనలతోనే ఉండేవారు.తలవంచుకొని బాంచన్ అంటూ బతకడం అతనికి నచ్చేదికాదు..ఆ..ఆలోచన విధానమే పిల్లలను చదివించాలనే సంకల్పంవైపు నడిపించింది.

తన ఇద్దరు కుమారులను చక్కగా చదివించుకున్నారు. కూతురును కూడా యూనివర్సిటీలో పిజి చేయించారు. ముగ్గురికీ వివాహాలు చేసారు. మహేష్ యూనివర్సిటీలో, చిన్నకుమారుడు శ్రీనివాస్ కురవి గ్రామపంచాయతీలో ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గౌరవం పొందుతుంటే మురిసిపోయాడు. ఏ..దిష్టి తగిలిందో.. కాలానికే కన్ను కుట్టిందో కానీ…కొన్ని సంవత్సరాల క్రితం చిన్నకుమారుడు శ్రీనివాస్ రోడ్డుప్రమాదంలో కన్నుమూసాడు. ఇప్పుడు పెద్దకుమారుడు మహేష్ ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో.. ఎదిగివచ్చిన తన కొడుకులకు ఏమిటి ఈ..రాత అంటూ గుండెలు పగిలేలా ఏడ్వడం తప్పా.. ఆ..కుటుంబానికి ఏ..దిక్కు కనిపించడం లేదు..

also read;-పారిశుద్ధ్య కార్మికులకు , వృద్ధులకు , బీదలకు ఉచితంగా బ్లాంకెట్స్ ,