Telugu News

ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం..

0

ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం

== సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం..

(హైదరాబాద్-విజయం న్యూస్)

పార్లమెంట్ ఎన్నికల అనంతరం తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి , సంక్షేమ పథకాల విషయంలో రెండు నెలల పాటు విరామం రావడంతో పరిపాలనను పూర్తి స్థాయిలో గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ లోకి దిగనున్నారు. అందులో భాగంగానే ఈ నెల 18న తెలంగాణ మంత్రివర్గం సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది..

ఇది కూడా చదవండి:- ముష్టికుంట వద్ద ఘోర ప్రమాదం..

*రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్ర విభజన బిల్లు అంశంలో నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించనున్న మంత్రి వర్గం..*

విభజన అంశంలో పెండింగ్ సమస్యలపై చర్చ..

*ధాన్యం, మక్కలు కొనుగోలు, అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు, నష్టపోయిన రైతులను అదుకునే విషయంపై చర్చ..*

*పంచాయతీ ఎన్నికలపై చర్చ.. రిజర్వేషన్ల ప్రక్రియ పై మంత్రి వర్గం నిర్ణయం..*

*రాష్ట్ర రాజధాని పూర్తి స్థాయిలో కేటాయింపు పై చర్చ.‌. అధికారులకు కీలక అదేశాలు..

జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సమావేశంలో చర్చించనున్న మంత్రి వర్గం..

జూన్ 2న తెలంగాణ తల్లి సోనియా గాంధీ ని ప్రత్యేకంగా ఆహ్వానించే తీర్మానం చేయనున్న కేబినెట్..

ఇది కూడా చదవండి:- చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం.

జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ రాజదానిగా హైదరాబాద్ ను ఏర్పాటు చేసే అంశంపై చర్చించనున్న మంత్రి వర్గం