Telugu News

*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు : షర్మిళ

రైతులు,నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చీమకుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి కేసీఆర్ కి... ప్రతి చివరి గింజ కొనుగోలు చేస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్,రైతు పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఢిల్లీలో ధర్నాలతో డ్రామాలు ఆడుతున్నాడు...

0

*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు : షర్మిళ

రైతులు,నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చీమకుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి కేసీఆర్ కి…

ప్రతి చివరి గింజ కొనుగోలు చేస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్,రైతు పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఢిల్లీలో ధర్నాలతో డ్రామాలు ఆడుతున్నాడు…

ఏ ప్రభుత్వం లో నైనా నేను చెప్పిన పంట వేయాలి అనే హక్కు పాలకులకు ఎక్కడైనా ఉందా…

మద్దతు ధర ఉన్న పంట పండించకపోతే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏ పని చేసి బతకాలి…

పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతుల్ని హింసిస్తున్న కెసిఆర్ కి ముఖ్యమంత్రి పదవి అవసరమా…

ఆనాడు కులమత బేధాలు పార్టీల కతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డి…

ఖమ్మం జిల్లాలో 1లక్షా 20 వేల ఎకరాలకు గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది…

పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా గిరిజన మహిళలు, చంటిపిల్ల తల్లులపై కేసులు బనాయించి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కింది…

also read :-బండ నెత్తిన…బాధలు గుండెల్లో

రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేని సమయంలో ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది….

రాజన్న బిడ్డగా మీ ముందుకు వచ్చా నన్ను ఆశీర్వదించండి మళ్లీ రైతు రాజ్యాన్ని తీసుకవస్తా…

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చొడులో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మాటా ముచ్చట కార్యక్రమంలో వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల…

also read :-కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ ధరలకు నిరసన