నేడు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల
== తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు
== డిసెంబర్ లో ఎన్నికలు ఉండే అవకాశం
(న్యూఢిల్లీ-విజయంన్యూస్)
దేశంలో అతి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది.. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలోని తెలంగాణ రాష్ట్రంతో పాటు, మిజోరం, చత్తీస్ ఘడ్, రాజస్తాన్, మద్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ పూర్తిగా సన్నిద్దమైంది. ఐదు రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. అందులో భాగంగానే సోమవారం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. ఎప్పుడు ఎన్నికల వస్తాయి..పోలింగ్ ఎప్పుడు ఉంటుంది.. ఎన్ని రోజుల గ్యాఫ్ ఇస్తారు.. అనే వివరాల కోసం దేశంలోని ప్రజలందరు ఎదురు చూస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది ఇది కూడా చదవండి: ఎన్నికలకు ముహూర్తం ఖరారైనా..?
== డిసెంబర్ లోనే పోలింగ్..?
జనవరి 16, 2024 వరకు తెలంగాణ ప్రభుత్వం గడువు ఉంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా అంతే సమయం ఉంది. ఈ సమయం లోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. ఎన్నికలను నిర్వహించే రాష్ట్రాల్లో పర్యటించింది. కచ్చితంగా ఎన్నికలను నిర్వహిస్తున్నామని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, పార్టీ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయా పార్టీల నాయకులు కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు చేస్తున్నారు. అయితే జనవరి 16 లోపు ఎన్నికలను నిర్వహించాలంటే కచ్చితంగా డిసెంబర్ లోనే పోలింగ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.. అక్టోబర్ లో నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రీయను ప్రారంభించి నవంబర్ మొదటి వారంలో పూర్తి చేసి, 15 రోజుల పాటు ప్రచారానికి అవకాశం ఇచ్చి డిసెంబర్ మొదటి వారంలోనే పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. దీంతో కౌంటింగ్ 15 రోజలు సమయం తీసుకుని డిసెంబర్ చివరి వారంలో కౌంటింగ్ చేసే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ సమయాన్ని కూడా ఇలాగే ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం ఐదు రాష్ట్రాల ఫలితాలు ఒకే రోజున విడుదల చేసే అవకాశం ఉంది.