Telugu News

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.

= రైతులు అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యలు

0

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.
== రైతులు అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యలు
== ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కంట కన్నీరు ఆగడం లేదు.
== మిర్చికి చీడపీడలు,వ్యవసాయ అధికారులు పంటల పరిశీలనకు వచ్చి చేతులెత్తాస్తున్నారు
== మిర్చి సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
== ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకుండా పోయింది.
== మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్
(రఘునాథపాలెం,ఖమ్మం-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, రైతులు అప్పులు తీర్చేదారిలేక, ప్రభుత్వాలు రైతులకు భరోసానిచ్చే పరిస్థితి లేకనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ.జావిద్ అహ్మద్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం పాపాటపల్లి గ్రామానికి చెందిన మిర్చి రైతు భూక్య సోమ్లా నాయక్ గత 30 వ తారీకున పరుగులు మందు తాగి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పండించడం కోసం 4 లక్షల రూపాయల పేగా అప్పు చేశాడు. అయితే కాపు దశలో గుబ్బ తెగులు వచ్చి సోకి పైరు మొత్తం దెబ్బతినడంతో ఆందోళన చెందిన రైతు సోమల ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు జావిద్, కాంగ్రెస్ నాయకులు ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

also read;-వనమా రాఘవ రిమాండ్

ఈ సందర్భంగా జావిద్ మాట్లాడుతూ పంటలకు ఇంత నష్టం వస్తుంటే అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సగానికిపైగా తోటలు దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయినప్పటికి ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం పొలాలవైపు వెళ్లడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెగుళ్ల ను పరిశీలించాల్సిన వ్యవసాయ శాఖ కనిపించకుండా పోయిందని, నకిలీ విత్తనాలపై చర్యలు లేకపోవడం ఫలితంగానే వాతావరణంలో స్వల్పతేడాలు వచ్చిన వ్యాధులను సోకి పంటలను మాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సలహాలు ఇచ్చే వారే లేకుండా పోయారని, ఫలితంగా మిర్చి సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని చెప్పారు. == పాలాభిషేకాలు చేసేది రైతులు కాదు టీఆర్ఎస్ నేతలు
ఒక వైపు మిర్చి, మరో వైపు పత్తి, ఇంకో వైపు ధాన్యం పంటలు పండక, దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతే తెలంగాణ ప్రభుత్వం పుండుమీద మందుబూసినట్లు రైతుబంధు ఇచ్చి సంబరాలు చేయించుకోవడం, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం, పాలాభిషేకం చేయడం హాస్యస్పదంగా ఉందని ఎండీ జావీద్ ఆరోపించారు.

also read;-సైడ్ కాలవలో పడి యువతి మృతి

కేసిఆర్ చిత్రపటానికి పాల అభిషేకం, పూలాభిషేకం చేసేది రైతులూ కాదని, టీఆర్ఎస్ పార్టి నాయకులే పాలాభిషేకాలు చేస్తున్నారని అన్నారు. మంత్రి వెంటనే స్పందించి రఘునాధపాలెం మండలం లో మిర్చి పంట నష్టాన్ని అంచనా వేయించి రైతులను ఆదుకోవాలని నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అధైర్య పడొద్దని కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, ఖమ్మం నగర రెండో డివిజన్ కార్పొరేటర్ ఎం వెంకటేశ్వర్లు, దీప నాయక్, బానోత్ బాలాజీ నాయక్, దుoప్పటి నగేష్, రేపల్లె రమేష్ డి నరేష్ చౌదరి, ఏలూరి రవికుమార్, చల్లా వెంకటేశ్వర్లు,తావుర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు