Telugu News

గవర్నర్ హక్కులను హరిస్తున్న కేసీఆర్: గోనే ప్రకాష్

ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారు:-మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు

0

గవర్నర్ హక్కులను హరిస్తున్న కేసీఆర్

== ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారు: మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు

(కరీంనగర్ -విజయం న్యూస్)

గవర్నర్ లకున్న విచక్షణ అధికారాలను, ప్రజాస్వామ్య హక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ హరిస్తున్నాడని మాజీ శాసనసభ్యుడు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ఆరోపించారు.

Allso read:- ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం

కరీంనగర్ ప్రెస్ భవన్ లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్ కు ఉన్న అధికారులను పక్కనపెట్టి విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు చేయడం అక్రమం అని ఖండించారు. విశ్వవిద్యాలయాలలో ఐదు వేల ఉద్యోగాల నియామకాల విషయంలో కెసిఆర్ ఒంటెద్దు పోకడలకు పోవడం సరికాదన్నారు. గవర్నర్ ప్రోటోకాల్, అధికారాలపై కేసీఆర్ ప్రభుత్వం పెత్తనం చెలయించాలని చూడడం సరికాద న్నారు. స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీలను కెసిఆర్ తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీల అధికారాలను హరింపజేసి ఆయా విశ్వవిద్యాలయాల్లో కార్యకర్తలతో ఉద్యోగాలను నింపుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీల శాసనసభ్యుల పార్టీ మార్పు అంశంపై ఆయా పార్టీలు శాసనసభ ఆవరణలో సాక్షాత్తు గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆయా పార్టీలు చేసిన విజ్ఞప్తుల విషయంలో శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్లు ఇప్పటివరకు నాన్చి పదవుల ఉల్లంఘన పాల్పడింది నిజం కాదా అని ప్రశ్నించారు.

Allso read:- బి జె పి వి అసత్యపు ప్రచారం- మంత్రి గంగుల ధ్వజం

శాసనసభ్యుల ఫిరాయింపులు మొదలు అనేక అంశాలలో ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్న ముఖ్యమంత్రికి గవర్నర్కు ఉన్న విచక్షణ అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. గవర్నర్ల వ్యవస్థని ప్రభుత్వం శాసించే స్థాయికి చేరుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అన్నారు. గవర్నర్కు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను తెలంగాణ పాలక పక్షం ఉల్లంఘిస్తోందన్నారు. యూనివర్సిటీల బిల్లుపై గవర్నర్కు సందేహాలు రావడంలో తప్పేముందన్నారు.పాలకపక్షంతో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి సీఎం కార్యాలయానికి లేఖ రాస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు. అభ్యంతరాలను నివృత్తి చేసుకోకుండా 5000 ఉద్యోగార్తులతో చలగాటమాడడం తగదన్నారు. విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్గా కెసిఆర్ వ్యవహరిస్తూ కార్యకర్తలతో ఉద్యోగాలను నింపుకోవాలని చూస్తున్నాడని పేర్కొన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా తమ పార్టీలోకి వచ్చారని కేసీఆర్ ఇటీవల ప్రగతి భవన్ లో చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు.

Allso reads:- మంత్రి గంగుల కమలాకర్ కు షాక్

శాసనసభ్యుల పార్టీల ఫిరాయింపుల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు,
ఆ వివరాలను సమాజం ముందు ఉంచేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధిత సమాచారాన్ని అందించాలని శాసనసభ, కార్యాలయాలను కోరినట్లు తెలిపారు. ఈ విషయంపై పది రోజుల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.