Telugu News

ప్రజలకు తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.

** కరెంట్ బిల్ చార్జీలను పెంచేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

0

ప్రజలకు తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్
** కరెంట్ బిల్ చార్జీలను పెంచేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
**అతిత్వరలో ప్రజలపై విద్యుత్ భారం
** పేద ప్రజలపై భారం పడకుండా చార్జీలను పెంచాలని సీఎం సూచించినట్లు సమాచారం
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ సర్కార్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది.. ఇప్పటికే ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేందుకు సిద్దమైన తెలంగాణ ప్రభుత్వం మరోసారి మరో భారం మోపేందుకు సిద్దమైంది.. విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సీఎం కేసీఆర్ అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది. యూనిట్ల పేరుతో ధరలను పెంచుతూ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్ సీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.

అలాగే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల పై భారం పడకుండా ఛార్జీలు పెంచాలని అధికారులను ఆదేశించారు. అతి త్వరలోనే పెంచిన చార్జీలను అమలు చేసే అవకాశం ఉంది. పెంచిన చార్జీలను ముందుగా మంత్రివర్గంలో అమోదం తెలిపిన తరువాత శాసనసభ,మండలిలో ప్రతిపాధించి వాటి అమోదం తెలిపిన అనంతరం అమలు చేసే అవకాశం ఉంది. అయితే శాసనసభ,మండలిలో పూర్తి స్థాయిలో బలం ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే చార్జీలు పెంచే అవకాశం కనిపిస్తోంది..
** కేంద్రం వల్లనే పెంచుతున్నాం
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలవల్లనే విద్యుత్ చార్జీలు పెరగడానికి ప్రధాన కారణమని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం నిర్ణయాలనే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, తప్పని పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలను పెంచాల్సి వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రభుత్వం రూ.50 ఉండే గ్రీన్ ఎనర్జీసెస్ రూ.400 వరకు పెంచిందని, తద్వారా రాష్ర్టానికి భారీగా భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.7,200 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం చెబుతున్నట్లు సమాచారం. అయితే తప్పని పరిస్థితుల్లోనే విద్యుత్ చార్జీలను పెంచాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే యూనిట్ కు ఎంత పెంచాలి, కేవలం ప్యాక్టరీలకు, సంస్థలకు మాత్రమే పెంచుతారా..? లేదంటే అన్నింటికి చార్జీలు పెంచుతారనే విషయాన్ని విద్యుత్ శాఖ చేసే ప్రతినిధానలను భట్టి ఉంటుంది.
** సోలార్ వైపు అడుగులు
విద్యుత్ చార్జీల భారం రోజురోజుకు పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ మరో ప్రాజెక్టు వైపు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. సోలార్ ప్రాజెక్టులను నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా విద్యుత్ చార్జీల భారం తగ్గించుకోవాలని, అందుకే సోలార్ వైపే అడుగులు వేస్తే భాగుంటుందని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విద్యుత్ శాఖాధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోలార్ వల్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని, నీటి ద్వారా విద్యుత్ తయారిని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చూద్దాం సోలార్ సిస్టమ్ ఎంత వరకు రాష్ట్రంలో సక్సెస్ అవుతుందో తెలియదు కానీ, విద్యుత్ చార్జీల మోత మోగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

also read :-చి”వరి”కి మద్దతుధర దక్కేనా…?-ప్రకటనలకే పరిమితమైన అధికారులు.