తెలంగాణకే తలమానికంగా మారిన శ్రీ మహాశక్తి ఆలయం..
?వసంత పంచమి సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయానికి పోటెత్తిన భక్తులు..
?తెలంగాణకే తలమానికంగా మారిన శ్రీ మహాశక్తి ఆలయం..
?వసంత పంచమి సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయానికి పోటెత్తిన భక్తులు..
?ఘనంగా వసంత పంచమి వేడుకలు..
దక్షిణ భారతదేశంలో ప్రప్రథమంగా శ్రీ మహాదుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లతో కరీంనగర్ పట్టణంలో కొలువుదీరిన శ్రీ మహాశక్తి ఆలయం తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మారి సమస్త భక్త జనాలతో నీరాజనాలు అందుకుంటోంది. వసంత పంచమి పర్వదినం సందర్భంగా కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయం వేలాది భక్తుల రాకపోకలతో కిటకిటలాడింది . ముఖ్యంగా వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతి అమ్మవారి దర్శనం, చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమాలకు కరీంనగర్ పట్టణం,జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు మహాశక్తి ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు.
also read :-పాలేరు నియోజవకర్గంలో కందాళ సుడిగాలి పర్యటన
మహాశక్తి ఆలయంలో వసంత పంచమి పురస్కరించుకొని దేవాలయంలో ఉదయం నుండి అమ్మవార్లకు పూజ, అభిషేకాలు, కుంకుమార్చన, పుస్తక పూజ, అక్షరాభ్యాసము నిర్వహించారు. వసంత పంచమి వేడుకను పురస్కరించుకొని మహాశక్తి దేవాలయ ప్రాంగణాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. దేవాలయ ప్రాంగణంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేసి, భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. దేవాలయ ఆవరణలో భక్తులు, విద్యార్థులు తమ భక్తిశ్రద్ధలతో అమ్మవార్లను దర్శించుకుని, సరస్వతి అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వసంత పంచమి శుభ గడియల్లో మహాశక్తి దేవాలయంలోని సరస్వతి దేవి ముందు వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రాతఃకాలం మొదలుకొని సాయంత్రం వేల వరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు.