Telugu News

తెలంగాణ దేశానికే మోడల్: మంత్రి నిరంజన్ రెడ్డి

కార్యకర్తలే బిఆర్ఎస్ కు బలగం

0
తెలంగాణ దేశానికే మోడల్: మంత్రి నిరంజన్ రెడ్డి
== కార్యకర్తలే బిఆర్ఎస్ కు బలగం*
== సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి*
== సత్తుపల్లి నియోజకవర్గంలోని బీరాపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య  అధ్వర్యంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .*
== ముఖ్యఅతిథులుగా హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు , రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి,ఎమ్మెల్సీ తాత మధుసూదన్
== ఆత్మీయ సమ్మేళనానికి వేలాదిగా తరలివచ్చిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు.*
 సత్తుపల్లి, ఏప్రిల్ 3 (విజయం న్యూస్):
సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండల పరిధిలోని బీరాపల్లి  సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య   సారధ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు , రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి , జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్  హాజరయ్యారు.
ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా వుండే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని కార్యకర్తలే పార్టీకి బలం బలగం అని అన్నారు. బిజెపి – కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చేసింది ఏమి లేదని అన్నారు. పేదలకు సాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు. పేదలు, రైతుల కోసం పనిచేస్తున్న బిఆర్ఎస్ పార్టీని కాపాడుకుందాం అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పార్టీలకతీతంగా ప్రతి గడపగడపకు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందితే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్న దేశంలో ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. వ్యవసాయ రంగానికి  24 గంటల కరెంటు,రైతులకు రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు, కెసిఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు వంటి నగదు బదిలీ పథకాలతో పాటు  సిసి రోడ్లు,  డ్రైనేజీ నిర్మాణాలు, స్మశాన వాటికలు వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తో పాటు మన ఊరు మనబడి  మండలంలో పాఠశాలలను మౌలిక వసతులు కల్పిస్తూ ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాల వెంకటరెడ్డి, జడ్పిటిసి సభ్యులు మారోజు సుమలత, జిల్లా డిఎస్ఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు,ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దొడ్డ శ్రీలక్ష్మి వెంకటకృష్ణారెడ్డి, బీరపల్లి సర్పంచ్, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మండలంలో వివిధ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు…