దేశానికే తెలంగాణ ఆదర్శం:- మంత్రి పువ్వాడ
== సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సువర్ణ పరిపాలన
== తెలంగాణ రాష్ట్ర 10వ అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు
(ఖమ్మంప్రతినిధి-విజయమ్ న్యూస్)
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అనేక పోరాటాలు, త్యాగాలు,బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాం అని అన్నారు.తొమ్మిదేళ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇదికూడా చదవండి: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను వొక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు, తదితర మౌలిక వసతులను, స్వల్పకాలిక, ధీర్ఘకాలిక లక్ష్యాలతో కల్పన చేసుకుంటూ వస్తున్నామన్నారు. భారత దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉందన్నారు.సమైక్య రాష్ట్రంలో విస్మరించబడిన రంగాలను, వొక్కొక్కటిగా ఓపికతో, దార్శనికతతో అవాంతరాలను లెక్కజేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చక్కదిద్దుకుంటూ వస్తున్నారని అన్నారు. తెలంగాణ సమాజం తొంభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో నిండివున్న నేపథ్యంలో వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో మరింత ప్రగతిని సాధిస్తాం అని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
ఇదికూడా చదవండి: కొణిజర్లలో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి