Telugu News

తెలంగాణ లోగో సిద్దం

లోగోలో  అమరవీరుల స్థూపం..వరి వంగడాలు ఏర్పాటు

0

తెలంగాణ లోగో సిద్దం

== లోగోలో  అమరవీరుల స్థూపం..వరి వంగడాలు ఏర్పాటు

== జూన్ 2న అవిష్కరించనున్న సోనియాగాంధీ 

(హైదరాబాద్ -విజయం న్యూస్)

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తీరువాత మొదటిసారి జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.. గ్రామ స్థాయిలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఈ మేరకు తెలంగాణ లోగో, పాట ను మార్చాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే తెలంగాణ మేధావులతో కలిసి లోగోను, పాటను సిద్దం చేశారు.

తెలంగాణ రాజముద్రకు సంబంధించి మూడు లోగోల ఫొటోలు తయారు చేయగా, తాజాగా, ప్రభుత్వం ఈ చిహ్నాన్ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. లోగోలు అమరుల స్థూపం, వరి కంకులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉంది. మూడు సింహాల గుర్తును లోగోకు జత చేశారు.

అయితే గతంలో తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలుపు రంగు బ్యాక్ గ్రౌండ్‌లో ఆకుపచ్చ రంగులో ఉండగా.. కొత్త లోగోలో ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులు ఉన్నాయి. అయితే ఈ గుర్తును ప్రభుత్వం అధికారంగా ప్రకటించాల్సి ఉంది.