Telugu News

తెలంగాణ అంటే సీఎం జాగీరా: ప్రియాంకగాంధీ

ఆత్మబలిదానాలు వృధా కానీయొద్దు

0

తెలంగాణ అంటే సీఎం జాగీరా: ప్రియాంకగాంధీ

== ఆత్మబలిదానాలు వృధా కానీయొద్దు

== వచ్చే ఎన్నికల్లో అప్రమత్తంగా ఉంటే మోసపోతారు

== ఇందిరను జ్ఞాపకం పెట్టుకున్న మిమ్ములను కాపాడుకుంటా

== అధికారం రాగానే ఇచ్చిన హావిూలను నెరవేరుస్తా

== హావిూలు నెరవేరకుంటా ప్రభుత్వాన్ని లాగేసుకోండి

== ఇంటికో ఉద్యోగం అన్నారు..ఇచ్చారా?

== నిరుద్యోగ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ

(హైదరాబాద్‌-విజయంన్యూస్):

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇస్తే.. ఆ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ తన జాగీరు అనుకుంటున్నారని కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే అందరూ మంచి జరుగుతుందని అనుకున్నారని..కానీ కేసీఆర్‌ ఇక్కడ నియంత పాలన చేస్తున్నారని విమర్శించారు. ఇంటికో  ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఎవరికైనా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా అని నిఉద్యోగ సదస్సులో ఆమె  ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదన్నారు.

ఇది కూడా చదవండి: *కాంగ్రెస్ నిరుద్యోగ డిక్లరేషన్*

నిరుద్యోగు లకు భృతి ఇస్తామని చెప్పి..మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే పరిమితం అయ్యాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డెవలప్‌ మెంట్‌ లేదు..వివిధ వర్గాల ప్రజలకు సాయం లేదు..ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వారంతా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

తెలంగాణలో  ప్రభుత్వ పాఠశాలలను తగ్గించారని… విద్యా బడ్జెట్‌ ను తగ్గిస్తున్నారని మండిపడ్డారు.  తెలంగాణలో ప్రతీ వ్యక్తిపై వేల రూపాయల అప్పుందన్నారు. తెలంగాణను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. త్వరలో తెలంగాణలో  ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు.  ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో ప్రుజలు జాగరూకతతో ఉండాలని… ఆ చైతన్యంతోనే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. తనను ఇందిరమ్మ అంటే  బాధ్యత ఇంకా పెరుగుతుందన్నారు. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హావిూలు ఇవ్వలేనన్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని….పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని..అదే బాధ్యతతో యూత్‌ డిక్లరేషన్‌ను ప్రకటిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక హావిూలు నెరవేర్చలేకపోతే అధికారం వెనక్కు తీసుకోండని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: చీరలు కొన్న భట్టి విక్రమార్క.. ఎవరి కోసం

’తెలంగాణ విూకు నేల కాదు.. తల్లి వంటిది’ అని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన ’ యువ సంఘర్షణ సభ’కు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ’ జైబోలో తెలంగాణ  అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘తెలంగాణ విూకు తల్లి వంటిది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ కోసం ఎందరో ఆత్మ బలిదానాలు చేశారు. మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదు. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు. ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. సోనియా తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరక పోవడం బాధగా ఉందన్నారు. ఆత్మబలిదానాలు వృధా కావద్దని సోనియా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ కోసం అన్ని వర్గాలవారు పోరాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగా

ణ తమ జాగీరులా భావిస్తున్నారు‘ అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రతి వ్యక్తిపై వేల కోట్ల రూపాయల అప్పు ఉందని, రాష్ట్ర డబ్బు, సంపద అంతా ఎక్కడికి పోయిందని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. తెలంగాణలో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు అప్రమత్తతో ఉండాలని సూచించారు. లేదంటే ప్రజలే నష్టపోతారని చెప్పారు. గడిచిన రెండు వారాలుగా తాను కర్ణాటకలో ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు.

ఇది కూడా చదవండి: ఔటర్‌ రింగ్‌రోడ్డులో భారీకుంభకోణం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ యువ సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ రాష్ట్రం వాళ్ల జాగీరు అనుకుంటున్నారు. జాగీర్దార్లు అనుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రభుత్వం వచ్చినా మంచి జరుగుతుందని అందరూ నమ్మారు. ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తానని అప్పట్లో కేసీఆర్‌ చెప్పారు. ఇప్పుడు విూ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్‌ అయ్యాయి. వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? గత 9 ఏళ్లలో 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయ

== ఇందిరమ్మ అని నన్నంటే బాధ్యత పెరిగింది

నన్ను ఇందిరమ్మ అంటుంటే నాపై మరింత బాధ్యత పెరుగుతుంది. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరను ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. ఆమెను స్మరించుకుంటూ నేను తప్పుడు హావిూలు ఇవ్వలేను. నిజాయతీగా మాట్లాడుతున్నాను. మేమూ సరిగ్గా పని చెయ్యకపోతే మమ్మల్ని కూడా తొలగించండి. యూత్‌ డిక్లరేషన్‌ విషయంలో మేం జవాబుదారీగా ఉంటాం. కొంత మంది మతం పేరుతో విూ భావోద్వేగాలను రెచ్చగొడ తారని అన్నారు. తెలంగాణ అమరవీరులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: మరమగ్గాలకు ఉచిత కరెంటు ఇస్తాం: భట్టి విక్రమార్క

యువత ఆశలను నెరవేర్చడానికి తెలంగాణ ఏర్పాటు అయింది. నీరు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించారు. రాష్ట్రంలో యువత త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువకులకు 3 వేల భృతి ఇస్తాం అన్నారు. ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ లేదు.. భృతి లేదు. చాలా హావిూలు ఇచ్చారు. ఒక్కటి నెరవేరలేదు. తక్కువ మంది పాఠశాలలో చేరుతున్నారు. పాఠశాలలో సౌకర్యాలు లేవు. తెలంగాణ విూది. విూ త్యాగాల వల్ల వచ్చింది.. తెలంగాణను బాగు చేస్కోవడం విూవిూద ఎక్కువ బాధ్యత ఉంది. విూరు చైతన్యంతో ఉండి పని చేయాలి.. లేకపోతే నష్టపోయేది యువతనే అని హెచ్చరించారు. ’ నన్ను నయా ఇందిరమ్మ అంటున్నారు. ఇది మామూలు మాట కాదు.. ఇది పెద్ద మాట.. ఇందిరమ్మ 40 ఏళ్ల కింద దేశం కోసం త్యాగం చేసిన ఇంకా విూరు గుర్తు పెట్టుకున్నారు. సోనియమ్మను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డను నేను. ఎన్నికల ముందు దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడతారు. ఎన్నికల తర్వాత చేతులు దులుపుకుంటారు. విూరు బైబై మోదీ, బైబై కేసీఆర్‌ అనాలి. మేం ఇచ్చిన యూత్‌ డిక్లరేషన్‌ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ ది. మేము అమలు చేయకపోతే మా ప్రభుత్వాన్ని దించేయండని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రియాంక అన్నారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది అని ప్రశ్నించారు.

లేదు. ఒక్క ప్రభుత్వ వర్సిటీలో కూడా ఉద్యోగ నియామకాలు జరగలేదు.అని ప్రియాంక అన్నారు.

 

ఇది కూడా చదవండి: బీజేపీ, టీఆర్ఎస్ దొందుదొందే..?: రాహుల్ గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి ఇస్తామని ప్రకటించారు. యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హావిూ ఇచ్చారు. ఉద్యోగాలు లేక లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క పరీక్షల పేపర్లు లీక్‌ అవుతున్నాయని, పేపర్‌ లీక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 9 ఏళ్లలో ప్రభుత్వం ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని, ప్రైవేట్‌ యూనివర్సిటీలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిరదని… శ్రీకాంతాచారి వంటి ఎంతో మంది  అమరవీరుల ఆకాంక్షలతోనే  తెలంగాణ కల సాకారమైందని ప్రియాంక గాంధీ  అన్నారు. ఏ ఒక్కరో పోరాడితే తెలంగాణ రాలేదని చెప్పారు.  త్యాగం అంటే ఏంటో తన కుటుంబానికి కూడా తెలుసని ప్రియాంక పేర్కొన్నారు. ఎంతో మంది అమరులు..త్యాగమూర్తుల బలిదానాలు వృథా కావొద్దన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు విహెచ్‌, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, సంపత్‌ కుమార్‌, మధుయాష్కీ ఇతరనేతలు పాల్గొన్నారు.