ఇది ప్రజాబలం: చంద్రబాబు
== తెలంగాణకు తెలుగుదేశం అవసరం
== అధికారం కోసం కాదు.. ఆత్మాభిమానమే నా లక్ష్యం
== స్పష్టం చేసిన మాజీ సీఎం చంద్రబాబు
== తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉంది
== ఆంధ్రాలో కన్నా తనకు తెలంగాణాలోనే నాకు ఆదరణ ఎక్కువ ఉంది
== తెలంగాణ రాష్ట్ర అభివద్ది టీడీపీ ఘనతే
== ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ
== పేదలకు అండగా నిలిచింది.. మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించింది టీడీపీ
== ఐటీ తెచ్చింది నేనే …బిల్ గెట్స్ ను మెప్పించింది నేనే
== హైదరాబాద్ కు ఐటీ ఐకాన్
== శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఘనత నాదే
== రింగ్ రోడ్, హైప్రాజక్టులకు ఆద్యుడను నేనే
== ఖమ్మం జిల్లా అభివద్ది చేసింది, ఖమ్మంలో మెడికల్ కాలేజీ ఇచ్చింది నేనే
== ఆలోచించండి.. అదరించండి
== కార్యకర్తలు బలమిస్తే.. నాయకులను తయారు చేస్తా
== ఖమ్మం శంఖారావం సభలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం
==దద్దరిల్లిన పటేల్ స్టేడియం
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
మనకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు, అయినప్పటికి ఉప్పెనలా జనం కదలిరావడం చూస్తుంటే నాకే అశ్ఛర్యం కల్గిందని, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేదని, ఏదని ప్రశ్నించిన వారికి ఖమ్మం బహిరంగ సభకు తరలివచ్చిన లక్షలాధి మంది జనమే సమాధానమిచ్చిందని, ఇది పైసలతో వచ్చిన జనం కాదని, ఇది ప్రజా బలమని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. 8 ఏళ్ల తరువాతఖమ్మం జిల్లాకు వచ్చిన తనకు అపూర్వ స్వాగతం పలకడం నేను మర్చిపోలేని అనుభూతినిచ్చారని అన్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం రోటరీనగర్ లో క్షుద్రపూజలు
ఈ జనం చూసిన తరువాత నాకు దైర్యం వచ్చిందని నమ్మకం కల్గిందన్నారు. తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కష్టాల నుంచి పుట్టిందని, నేతలు పోతుంటే పుట్టగొడుగుళ్లా పుట్టుకోస్తూనే ఉంటారని అన్నారు. బుధవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఆయన ఎనిమిదిన్నర సంవత్సరాల తరువాత పార్టీ కోసం తొలిసారిగా ఖమ్మం జిల్లాకు రాగా ఆయన కు ఊహించని విధంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతమైన కూసుమంచి మండలంలోని నాయకన్గ్ గూడెం గ్రామం వద్ద వేలాధి మంది పార్టీ శ్రేణులు, నాయకులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్ది హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం కేశ్వాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు అవిష్కరించారు. అనంతరం అక్కడ నుంచి వరంగల్ క్రాస్ రోడ్డుకు రాగా అక్కడ నేతలు గజమాలతో సత్కరించారు. అక్కడ నుంచి మోటర్ సైకిల్ ర్యాలీగా ఖమ్మం నగరం చేరుకున్న చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. మయూరిసెంటర్, వైరా రోడ్డు బ్లాక్ అయ్యింది.. సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. అనంతరం సర్థార్ పటేల్ స్టేడియంకు చేరిన చంద్రబాబుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు అభిమానం చేశారు. అనంతరం గంట పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబు ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఉత్సహాన్ని నేనుప్పుడు చూడలేదు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ‘అలిబాబా నూరు దొంగలు’ పాలన: అగునూరి మురళీ
నాయకన్ గూడెం చేరిన దగ్గర నుంచి ఖమ్మంలోని సభా స్థలి వరకు యువత, పెద్దలు, చిన్నారులు నా కోసం ఎగబడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. మీ ఉత్సాహం చూస్తుంటే మళ్లి యువకుడ్ని అయిపోయాను. యువత విరోచతనం నాకు బాగా నచ్చింది.. నేను తెలంగాణకు ఇచ్చిన ఐటీ రంగాన్ని ఆయుదంగా చేసుకున్న యువత ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. మళ్లి ఉద్యోగావకాశాలు కావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మిన యువత నాకు అడుగడుగున స్వాగతం పలికారు. వారందరికి రుణపడి ఉంటాను. వారందరికి టీడీపీ రుణం తీర్చుకుంటుంది. నేను మర్చిపోలేని రోజు. నేను ఎప్పుడు అధికారం కోసం పనిచేయలేదు. నేను అసలు అధికారం కోరుకోలేదు. మీ అభిమానం కోరుకున్నా. ఆత్మాభిమానం కోరుకున్నా. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకున్నా. ఆ విధంగానే పనిచేశా. విజన్ 2020 అని టార్గెట్ పెట్టి కాళ్లకు గజ్జలు కట్టుకుని పనిచేశా. అప్పటి నా విజన్ నేటి తెలంగాణ అభివద్దికి నాంధి అని అన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్న అదోక్కటే మిగిలేది.
== తెలుగుజాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్
తెలుగువారి గుండెచప్పుడు నందమూరి తారకరామరావు అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నాడు. తెలుగు వారి గుండెల్లో నిలిచిన నాయకుడు, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని కొనియాడారు. తెలుగు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగు ప్రజల సంక్షేమం కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం 1982లో హైదరాబాద్ లోనే తెలుగుదేశం పార్టీ పెట్టిన నందమూరి తారకరామారావు ఎన్నో పెనుమార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. అత్యంత కరువు పీడిత సమయంలోనే రేషన్ బియ్యంను నిల్వ చేసుకుని కేజీ బియ్యం రూ.2లకే అందించిన ఘనత ఎన్టీఆర్ ది అని అన్నారు. నాడు పటేల్, పట్వారీలు ప్రజాస్వామ్యాన్ని గుప్పెట్లో పెట్టుకుని ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారనే ఆలోచనతో ఏకపెన్ పవర్ తో ఆ వ్యవస్థనే రద్దు చేసి తెలుగు ప్రజలకు స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఇది కూడా చదవండి: “పంచముఖ పోరులో పాలేరు-అభివృద్ధి ని ఆకాంక్షిస్తున్న ప్రజలు”
మండలి వ్యవస్థను, సింగిల్ ఇండో వ్యవస్థకు ప్రాణం పోసిన తెలుగు ప్రజల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజల ఖ్యాతిని ఖండంతరాలు దాటించిన మహానీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పేద ప్రజల్లో ఆత్మవిశ్వాసం కల్పించారని, సంక్షేమం, అభివద్దిని పరుగులు పెట్టించారని అన్నారు. నేను కూడా ఆయన బాటలోనే పయనించానని, ఏ నాడు ఓట్ల కోసమో, సీట్ల కోసమో, కమీషన్ల కోసమే పరిపాలన చేయలేదని అన్నారు. చాలా ముందుచూపుతో పథకాలను అమలు చేశామన్నారు. మహిళలకు రిజర్వేషన్ పెంచి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామని అన్నారు. అప్పటి వరకు ఇంటికే పరిమితమైన మహిళలకు వెలుగునిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేన్నారు. వ్యవసాయాన్ని కాపాడేందుకు జన్మభూమి అంటూ చెరువులను బాగుచేస్తూ పనిచేశామని అన్నారు.
== హైదరాబాద్ కు ఐకాన్ ఐటీ రంగం
భారతదేశంలోనే హైదరాబాద్ ఐటీ రంగంలో మేటి గా నిలిచిందని, హైదరాబాద్ కు ఐకాన్ ఐటీ రంగమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడ్డానని అన్నారు. ఐటీ రంగాన్ని అభివద్ది చేసేందుకు హైటెక్ సిటిని నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఐటీ రంగం వల్లనే నేడు యువకులందరు ఎంతో మంది ఉద్యోగాలు పొందారని, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అద్భుతంగా సంపాధిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఐటీరంగం చదువులంటే హైదరాబాద్ అనే విధంగా తయారు చేశామని, మంచి బిజినస్ స్పాట్ గా హైదరాబాద్ నిలిచిందన్నారు.హైదరాబాద్ అభివృద్దికి కారణం తెలుగుదేశం పార్టీ పరిపాలనేనని, ఆనాడు నేను చేసిన సంస్కరణలేనని అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటి కోసం కాలుకు బలపం కట్టుకుని తిరిగానని, ఆ ఐటీ రంగంతో నేడు హైదరాబాద్ అభివృద్దిలో దూసుకపోతుందన్నారు. అంతే కాకుండా శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టను నిర్మాణం చేసింది నేనేనని అన్నారు. హైదరాబాద్ చుట్టు రింగ్ రోడ్డు తన పక్కా ప్లాన్ ముందుచూపుతనమని అన్నారు. అలాగే దేశంలో హైవే రోడ్లపై చర్చ జరుగుతుండగానే ఆంధ్రప్రాంతంలో హైవై ప్రాజెక్టును నిర్మాణం చేయించి తెలుగు ప్రజల గొప్పతనమేందో దేశానికి తెలిసే విధంగ చేశామన్నారు.
== బిల్ గెట్స్ మెప్పించిందినేనే
హైదరాబాద్ కు ఐటీ టెక్నాలజిని తీసుకరావడం కోసం ఎంతో కష్టపడ్డానని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు.
బిల్ గెట్స్ అసలు అవకాశం ఇవ్వలేదని, కొద్ది రోజుల తరువాత అవకాశం ఇస్తే ఐటి రంగం హైదరాబాద్ లో ఎందుకు పెట్టాలో పవర్ ప్రజేంటేషన్ చేసి చూపించిన తరువాత ఆయన అంగీకరించాడని అన్నారు. ఆ తరువాత ఐటీ రంగం ఎలా ఉందో కూడా మీ అందరికి తెలిసిందేన్నారు. సెల్ పోన్ తీసుకోస్తే నన్ను అప్పుడు ఎగతాళి చేశారని, ఇప్పుడు పెళ్లం లేకపోయిన, మొగడు లేకపోయిన ఉంటున్నారు కానీ సెల్ పోన్ లేకుండా ఎవరు జీవనం గడపడం లేదన్నారు.
ఇది కూడా చదవండి: ఇక నుంచి ‘ఇది నా అడ్డా..’
అలా ఐటీ రంగాన్ని బలోపేతం చేశానని అన్నారు. తాను ఏది చేసిన టీనేజర్ గా ఆలోచిస్తానని, ఎప్పడు ఎన్నికలకోసం పని చేయలేదని అన్నారు. ఐఎస్ బీ కి వెళ్ళాను…అన్ స్టాపబుల్ వెళ్లాను, అందులో ఏది దాచుకోకుండా చెప్పను, చప్పినా లేదా తమ్ములు అని సభికులను అడిగారు. ఇంజనీరింగ్ కాలేజీలు తానే ఇచ్చానని …ఐటీ ముందుగానే ఆలోచించి హైటెక్ సిటీ నిర్మించాను …ప్రపంచం అంతా కాలుకు బలపం కట్టుకుని తిరిగాను. బిల్ గేట్స్ ను తీసుకొచ్చాం…. ముందు అపాయింట్మెంట్ ఇవ్వని బిల్ గేట్స్ 10 నిమిషాలు అంటే 1 గంట సమయం ఇచ్చారు. ఆయన్ను హైద్రాబాద్ తీసుకొచ్చానని గుర్తు చేశారు. బిల్ గెట్స్ ను తీసుకొచ్చింది నాకోసమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత అభివృద్ది కోసం, భవిష్యత్ బయోటెక్నాలజీ దేనని ముందే గుర్తించి ఇక్కడ ఏర్పాటు చేయించన్నానని అన్నారు.
== బహుజనలును ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ స్పందించి అనేక పదవులను అందించిన ఘనత ఎన్టీ రామారావుదని కొనియాడారు. ఆయన బీసీలకు ఎన్టీఆర్ 25శాతం పెడితే, నేను 33శాతానికి పెంచా బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం లోకి రావాలని తపన చేస్లున్నానని అన్నారు. ఫలితంగానే అనేకమంది బీసీలు అధికారంలోకి వచ్చారని అన్నారు …ఆడ పిల్లలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించానని, అనేక మార్పులు తెచ్చానని అన్నారు.
== భద్రాచలం ఏమైయ్యేది..?
చంద్రబాబు ముందుచూపుతో ఆలోచించి తెలుగు రాష్ట్రాన్న అభివృద్ది చేశానని, 25ఏళ్ల క్రితమే భద్రాచలంలో గోదావరి పై కరకట్ట నిర్మాణం చేశానని గుర్తు చేశారు. ఆనాడు ముందుచూపుతో కరకట్ట కట్టడం వల్ల మొన్న వచ్చిన వరదల్లో భద్రాచలం సేఫ్ గా ఉండిపోయిందన్నారు. నేను ముందుచూపుతో ఆలోచించకపోతే భద్రాచలం ఏమైయ్యేదో..? ఒక్కసారి ఆలోచించాలని కోరారు. అక్కడ ప్రజలు కూడా జననిరాజనాలను అందించారని తెలిపారు. అలాగై హైదరాబాద్ ఐటీ రంగం, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, హైటెక్ సిటి, రింగ్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు.
== ఇది ప్రజాబలం
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేదన్నవారికి ఖమ్మంలో జరిగిన సభ కచ్చితంగా సమాధానం చెబుతుందని చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పారు. చాతగాని వ్యక్తులు టీడీపీ పై విమ్మర్శలు చేస్తూనే ఉంటారని, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్లలేరని అన్నారు. 9 ఏళ్ల పాటు సీఎంగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా రికార్డ్ ఉందని, ఆ రికార్డును ఎవరు బద్దలు చేయలేరని అన్నారు. ఏపీలో లో గాడితప్పిన పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ గాడిలో పెట్టె బాధ్యత తమదేనన్నారు. విజన్ 20:20 …దేశం లో తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్ గా ఉండాలనే కోరుకున్నానని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ….నీటి ప్రాజెక్ట్ లు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కట్టాం….రోడ్లు వేసామని అన్నారు. విభజన హామీలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని, ఖాజీ పేట కోచ్ ఫ్యాక్టరీ, స్పాంజి ఐరన్ కర్మాగారం,బయ్యారం స్టీల్ ప్లాంట్ అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్న విషయాన్నీ ప్రస్తావించారు.
== ఖమ్మం జిల్లా అభివృద్ది కారణం టీడీపీ పార్టీనే
ఖమ్మంజిల్లాఅభివృద్దికి కారణం టీడీపీనేని అని చంద్రబాబు అన్నారు. ఖమ్మం మెడికల్ కాలేజీ తామే ఇచ్చాం అన్నారు. తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే మాత్రమే ఉందన్నారు. కార్యకర్తలు యాక్టివ్ కావాలని పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే లేడు…ఎమ్మెల్సీ లేడు….అయినా ఇంతమంది సభకు రావడం చిన్న విషం కాదన్నారు. తెలంగాణాలో తెలుగుదేశంకు పునర్వైభవం తీసుకోని రావాలని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలేదు. కనీస మద్దతు ధర రావాలని, సమర్ధవంతంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని ఆవిధంగా లేకపోవడం బాధగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ కచ్చితంగా వాటిని సక్సెస్ చేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన అభివద్దిని చూసి ఓట్లేయాలని, ఆలోచించాలని, ఆశీర్వదించాలని కోరారు. చేసే పనులు శాశ్వతమని అన్నారు. ఖమ్మం బహిరంగ సభ నాకు తిరుగులేని శక్తినిచ్చిందన్నారు. అందరికి రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జ్జానేశ్వర్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూరపాటి వెంకటశ్వర్లు, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్, రాష్ట్ర నాయకులు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.