అభివృద్ధి లో తెలంగాణ నెం 1: మంత్రి హరీష్
== విద్యా, వైద్యం,ధాన్యం అభివృద్ధి లో తెలంగాణ దేశానికే ఆదర్శం
== పనోల్లు కావాలా..? పగోల్లు కావాలా..?
(ఖమ్మం -విజయం న్యూస్)
బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని, ఇప్పటికే అనేక ప్రాజెక్టులను నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేసిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. విద్య,వైద్యం, ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పోటీ పరీక్షల్లో తెలంగాణకు అద్భుతమైన ర్యాంకులు వస్తున్నాయని, కేంద్రమే ప్రకటించిందని అన్నారు.
ఇది కూడా చదవండి:- పాలమూరును ప్రజలు కావాలంటుంటే.. కాంగ్రెస్ వద్దంటోంది :మంత్రి హరీష్ రావు
గ్రామీణ స్థాయి విద్యార్థులను సైతం కార్పోరేట్ విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు, కళాశాలు, రెసిడెన్సీ, కస్తూరిభగాంధీ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. అందుకే ప్రతి పేదవిద్యార్థికి ఉన్నతమైన విద్యనభ్యసించే అవకాశం వచ్చిందన్నారు. అలాగే వైద్యం విషయంలో భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా 31 జిల్లాల్లో మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ఏకైక రాష్ర్టం తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలోనే రెండు మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలను మంజూరు చేశామన్నారు. గతేడాది మంజూరు చేసి ఏడాది సమయంలోనే క్లాసులు ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్ సర్కార్ కే దక్కిందన్నారు. తద్వారా ప్రతి ఏడాది 10వేల మంది వైద్యవిద్యార్థులు చదువుకునే అవకాశం వచ్చిందన్నారు.
ఇది కూడా చదవండి:- పనోల్లు కావాలా, పగోల్లు కావాలా: హరీష్ రావు
ఆటో డ్రైవర్ కొడుకు, కూలీ పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు ఉచితంగా వచ్చాయని అన్నారు. అంతకంటే ఇంకేం కావాలని రాష్ట్ర అభివద్ది జరిగిందనడానికి అని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 57శాతం రిజల్ట్ వస్తే, తెలంగాణ వైద్యవిద్యార్థులకే 47శాతం మంచి ఫలితాలు రావడం సంతోషించదగ్గ విషమన్నారు. ప్రతి చిన్న ఆసుపత్రిని సైతం 50పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసి, మౌళిక వసతులతో పాటు ఆసుపత్రికి క్వాలిటీ వైద్యులను ఏర్పాటు చేశామన్నారు. ఆ ఒక్క అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. అంతే కాకుండా సాగునీటి విషయంలో అనేక అద్భుతమైన నీటిప్రాజెక్టులను నిర్మాణం చేసి, కాలువలను తవ్వి చివరి ఎకరభూమికి సాగునీటిని అందించామని, తద్వారా దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి అవుతున్న రాష్ట్రంగా నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. విద్యలో నెంబరవన్, వైద్యంలో నెంబర్ వన్, ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్, ఇంటింటికి తాగునీటిని ఇవ్వడంలో నెంబర్ వన్, రైతులకు రుణమాఫీ చేయడంలో నెంబర్ వన్, రైతు బంధు సహాయం అందించడంలో నెంబర్ వన్ అన్నింటిలో నెంబర్ వన్.
ఇది కూడా చదవండి:-;ఎమ్మెల్సీ కవితా కు ఈడీ నోటీసులు
ఇంతకంటే ఇంకేం కావాలి ప్రజలకు అంటూ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షాలకు అవి కనిపించడం లేదని, అబద్దాలు మాట్లాడటం, పనులు చేస్తుంటే అడ్డుపడటం, పగపట్టి కేసులు వేయడం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ఇంటి మనిషి అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. మనకు పనోల్లు కావాలా, పగోల్లు కావాలా ప్రజలు ఆలోచించాలని కోరారు. బి ఆర్ ఎస్ కావాలి, కాంగ్రెస్ వద్దు అని ప్రజలు అంటున్నారని, ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు.