సంక్షేమంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్:మంత్రి
రూ.1.06 కోట్ల అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
సంక్షేమంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్:మంత్రి
== ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందేలా చూసిన ఘనత మా ప్రభుత్వానిదే.
== రూ.1.06 కోట్ల అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
(రఘునాథపాలెం-విజయంన్యూస్)
సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రఘునాధపాలెం మండల కేంద్రంలో రూ.1.06 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు.
ఇది కూడా చదవండి:- గ్యారంటీ…వారంటీ లేని వారి మాటలు నమ్మొద్దు:,నామ
తొలుత రఘునాధపాలెం మండల కేంద్రంలోని సెంటర్ లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.84.50లక్షలతో నిర్మించిన 24-సీసీ రోడ్ల ను ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.10లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్స్ ను ప్రారంభించారు. జీపీ ఫండ్స్ నిధులు రూ.7లక్షలతో ఎర్పాటు చేసిన ఓపెన్ జిమ్, రూ.5 లక్షలతో ఎర్పాటు చేసిన హరితహారం నర్సరీ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రఘునాథపాలెం మండలంగా నామకరణం చేసిన తరువాత మనడలంకు మహర్దశ పట్టింది.
ఇది కూడా చదవండి:- పార్టీని నడపలేని దద్దమ్మ రాహుల్ గాంధీ: మంత్రి
మండల హెడ్ క్వార్టర్స్ గా అన్ని సదుపాయాలు కల్పించినం. ఖమ్మం నగరంకు కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ కనీస మౌలిక వసతులు లేకుండా పోయింది. ఎమ్మేల్యేగా బాధ్యతలు చేపట్టిన నాడు మండలం కు ఒక స్వరూపం లేదు. ఒక్కో పని చేసుకుంటూ కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇంతటి స్థాయికి తీసుకురాగలిగినం. రఘునాథపాలెం గ్రామం కే రూ.83 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని ప్రధాన రోడ్లు వేసినమన్నారు. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అనేక మార్లు పాలించింది. ఏం చేసిందో మీరే చెప్పాలి.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఇచ్చింది ఎంత..? కేవలం రూ.200.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇస్తుంది ఎంత రూ.2 వెలు.. ఇప్పుడు కొత్తగా నాలుగు వేలు ఇస్తాం అని ప్రగల్భాలు పలుకుతున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు దమ్ముంటే ముందు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చి చూపించాలి అని సవాల్ చేస్తున్న..
ఇది కూడా చదవండి:- ఖమ్మం నగరం.. అభివృద్ధి గుమ్మం: పువ్వాడ
ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న మీ రాష్ట్రాల్లో ఇవ్వండి. తర్వాత తెలంగాణలో ఇవ్వొచ్చు.. చేతకాని మాటలు చెప్పడం చాలా తేలిక.. అది ఇచ్చేదా .. సచ్చేదా.. అని ప్రశ్నించారు. 2014 కి ముందు రైతులకు కరెంట్ ఉండేదా.. అసలు వ్యవసాయంకు ఉచిత విద్యుత్ ఇచ్చారా.. అసలు కరెంట్ ఉండేనా..అని అన్నారు. రైతులకు లేదు.. ప్రజల గృహాలకు లేదు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ముఖ్యమంత్రి కేసీఅర్ రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా ఇస్తుందా లేదా చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతు భీమ, రైతు బందు, ఎరువులు, ఇలా అనేక కార్యక్రమాలు రైతులకు అందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ప్రతీ వ్యక్తికి, ప్రతీ కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించాం…. ఇచ్చిన హామీలు నెరవేర్చినమన్నారు. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది.
ఇది కూడా చదవండి:- మున్నేరు వరదబాధితులకు అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్
పేదరిక నిర్మూలనలో, సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతీ మనిషికి, ప్రతి కుటుంబానికి ఏదో రకంగా సంక్షేమ పథకం అందేలా చూసిన ఘనత మా ప్రభుత్వానిదేనన్నారు. రైతు బంధు, బీమా లాంటి పథకాలే గాకుండా, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకంతో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి ప్రస్తుతం రఘునాదపాలెం మండలంలో చూస్తున్నారని అన్నారు. ఇది కొనసాగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ను గెలిపించాలి. ఇక్కడ నన్ను గెలిపిస్తే అక్కడ కేసీఅర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇంతకు రెండింతలు అభివృద్ధిని మీరు చూస్తారు. బీఆర్ఎస్ కు ఓటు వేయడం ద్వారా ఇపుడు అందుతున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ ప్రభుత్వంను మళ్ళీ అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.