Telugu News

దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌: మంత్రి పువ్వాడ

76ఏళ్లలో ఖమ్మంకు మంత్రి పదవి ఇచ్చింది ఒక కేసీఆర్ మాత్రమే

0

దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌: మంత్రి పువ్వాడ

== నేను ఖమ్మంలో పుట్టిన బిడ్డను

== మా నాన్న ఖమ్మం ప్రజలను వారసత్వంగా ఇచ్చారు

== నాకు ఉన్నంత నిబద్దత, కమిట్మెంట్ వేరే వాళ్లకు ఉండదు

== 76ఏళ్లలో ఖమ్మంకు మంత్రి పదవి ఇచ్చింది ఒక కేసీఆర్ మాత్రమే

== వెలుగు జిలుగుల ఖమ్మంను చూస్తున్నాం

== ఆత్మీయ సమ్మెళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరం 55వ డివిజన్ కార్పొరేటర్ శ్రావణి సుధాకర్ అధ్వర్యంలో బైపాస్ రోడ్ చౌదరి స్ట్రీట్ నందు  డివిజన్ వాసులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. నేను ఖమ్మంలో పుట్టిన బిడ్డను.. ఇక్కడే మాన్ పోర్ట్ స్కూల్ లో చదివిన, ఏఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ ఒక సంవత్సరం చదివిన. మా నాన్న ఖమ్మం ప్రజలను వారసత్వంగా ఇచ్చారు. అందుకే ఖమ్మం ప్రజలపై, ఇక్కడి అభివృద్దిపై బాధ్యతగా ఉన్నానని అన్నారు. మా నాన్న హాయం నుండి నాతో పాటు ఖమ్మంను వదిలి పక్క చూపులు ఎప్పుడూ చూడలేదు. చేసే పనిపై నిబద్దతతో ఉన్న. నాకు ఉన్నంత నిబద్దత, కమిట్మెంట్ వేరే వాళ్లకు ఉండదన్నారు. స్వతంత్రం వచ్చిన నాటి నుండి 76 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఖమ్మంకు మంత్రి పదవి రాలేదు.. ఎవరు కల్పించలేదు.

ఇది కూడా చదవండి: నేడు ఖమ్మంకు ‘తారకరామారావు’

కేవలం కేసీఅర్ మాత్రమే ఖమ్మం కు మంత్రి పదవి కల్పించారని గుర్తు చేశారు. కేసీఅర్ ఒకే మాట అన్నారు.. నా కొడుకు రామ్ ఎంతో నాకు అజయ్ కూడా అంతే అని.. అంతటి నమ్మకం నాపై ఉంచారు. ఆ ధైర్యం తోనే కోరిన నిధులను ఇచ్చారని వెల్లడించారు. నేడు కేటిఆర్ ఖమ్మం వస్తున్నారు.. రూ.1300 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని తెలపారు.  మున్నేరు పై దుర్గంచెరువు లాంటి కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని,  దీనికి తోడు మున్నేరుకు ఇరువైపుల రక్షణ గోడలు నిర్మించి మూడు చోట్ల చెక్ డ్యాం లు నిర్మించినున్నామని, తద్వారా మున్నేరు లో సంవత్సరం మొత్తం నీరు అందుబాటులో ఉంటాయి.. గ్రౌండ్ వాటర్ ఎప్పుడూ స్థిరంగా ఉంటాయన్నారు.  మనం కట్టె టాక్స్ లు ఏ మూలకు సరిపోవు.. టాక్స్ ల రూపంలో ఖమ్మం కార్పొరేషన్ కు మనకు వచ్చేది సుమారుగా కేవలం రూ.25 కోట్లు మాత్రమే.. కానీ వేల కోట్లతో అభివృద్ది ఎలా జరిగింది అన్నది ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరారు.  ఇదంతా కేసీఅర్, కేటిఆర్ సహకారంతోనే ఇన్ని వేల కోట్లు నిధులు తీసుకురాగలిగినం. హైద్రాబాద్ కు వెళ్తే ఖాళీగా అస్సలు ఉండేది లేదు.. తీసుకొచ్చిన నిధులకు సంబంధించి అధికారుల వెంట పడి నిధులు మంజూరు చేయించుకుని ఆయా పనులు ప్రారంభించి పూర్తి చేసేవరకు విశ్రమించేది లేదు. ఖమ్మంలో రోడ్లు, డ్రైన్లు, అన్ని సెంటర్ లలో కూడళ్లు, తడి, పొడి చెత్త సేకరణ, మురుగు నిల్వల తొలగింపు, పార్కులు, పబ్లిక్ టాయిలెట్స్, రోడ్ల విస్తరణ, ఓపెన్ జిమ్ లు, గోళ్లపాడు పై 10 పార్కులు, సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్, వెలుగు జిలుగుల ఖమ్మంను చూస్తున్నాం అంటే అది నిరంతరం శ్రమిస్తే తప్పితే ఇంత అభివృద్ది జరిగి ఉండదు… తియ్యగా పుల్లగా మాటలు చెప్తే రావు..

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి: మంత్రి పువ్వాడ

నలుదిక్కుల అభివృద్ధిని పరిచయం చేసి చూపించినం. ఏ దిక్కుకు వెళ్ళినా కాల్వల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, మంచినీళ్లు, విద్యుత్ ఇలా అనేక పనులు చేయడం ద్వారా విస్తరించినమన్నారు. వీటన్నిటికీ తోడు ప్రజల రక్షణ కోసం, సామాన్య పౌరుల భద్రత కోసం పోలీస్ వ్యవస్థను పటిష్ట పరచినం. అందుకు ఖమ్మంను పోలీస్ కమిషనరేట్ గా మార్చినం. తద్వారా పోలీస్ సిబ్బంది పెరిగారు.. పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

== దొంగ హామిలు..దొంగ మాటలు చెప్పడానికి వస్తున్నరు: మంత్రి

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొందరు వస్తారు.. దొంగ హామీలు, దొంగ మాటలు చెప్తారు.. అవేమీ నమ్మాల్సిన పని లేదు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, హ్యాట్రిక్ కొట్టేది మనమే.. కేసీఅర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.. వేరే ఏ ప్రభుత్వం రాదు.. అందుకు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వం ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిసిఎంఎస్ చైర్మన్ శేషగిరి రావు, BRS టౌన్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీపీఐ నాయకులు మిరియాల రంగయ్య, సీపీఎం నాయకులు దంతాల నర్సింహరావు, దాస్, జగత్ పాల్, సిరిపురపు సత్యనారాయణ, మధు, చారి తదితరులు ఉన్నారు.

== రూ.1.34కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన

ఖమ్మం నగరంలోని 33, 34, 35వ డివిజన్ లలో రూ.1.34 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం నగరం 35వ డివిజన్ మోతి నగర్ నందు ఎల్ఆర్ఎస్ నిధులు రూ.60లక్షలతో నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం సుడా నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన వీడీఎఫ్ రోడ్స్ లను ప్రారంభించారు. 34వ డివిజన్ నందు ఎల్ఆర్ఎస్ నిధులు రూ.24 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ కు శంకుస్థాపన చేశారు.33వ డివిజన్ నందు ఎల్ఆర్ఎస్ నిధులు రూ.25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి: అభివృద్ధిలో మాకు మేమే చాటి: మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరంలో ప్రతి డివిజన్ లో ప్రజల అవసరాల మేరకు వెతికి వెతికి రోడ్లు, డ్రెయిన్లు, త్రాగునీరు ఇతర సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.కేవలం అభివృద్ది కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి డివిజన్ కు దాదాపు 13కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించి పనులు చేపట్టడం జరిగిందని, ఎస్డీఎఫ్ నిధులు రూ.50 కోట్లతో సీసీ డ్రైన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. అవసరం ఉన్న మేరకు మరిన్ని నిధులు వెచ్చించి ఇంకా అరకొర రోడ్లు, డ్రైన్ లు వేసేందుకు సిద్దంగా ఉన్నామని వివరించారు. ప్రజల కోసం ఇంత చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంను ప్రజలు ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు రుద్రగాని శ్రీదేవి, తోట ఉమారాణి, పసుమర్తి రాంమోహన్, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, ఆర్జేసీ కృష్ణ, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, నున్నా మాధవ రావు, కన్నం ప్రసన్న కృష్ణ, బాలిని శ్రీనివాస్, బోజడ్ల రాం మోహన్, బండి నవీన్, కే.నాగరాజు, సంపత్, వెంకటేష్ పాషా తదితరులు ఉన్నారు.