Telugu News

తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంమంత్రి పువ్వాడ అజయ్ కుమార్

తెలంగాణ విజయం న్యూస్

0

తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంమంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(తెలంగాణ విజయం న్యూస్):-

తెలంగాణ పోలీసులు శాంతిభ‌ద్ర‌త‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తూ దేశానికే ఆద‌ర్శంగా నిలిచార‌ని రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాలు నెల‌కొల్పుతున్నార‌ని మంత్రి అజయ్ పేర్కొన్నారు.

రక్షణ సేవలు, కేసుల పరిష్కారం, స్టేషన్‌ నిర్వహణ తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులకు మంత్రి అజయ్ అభినందనలు తెలిపారు. 2021 సంవత్సరానికి సంబంధించి పనితీరు ఆధారంగా తెలంగాణ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉత్తమ పోలీస్‌స్టేషన్లను ఎంపిక చేశారు. వివిధ కేటగిరీల్లో ప్రతినెలా వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయగా ఉమ్మడి జిల్లాలో పలు పోలీస్‌స్టేషన్లు ఉత్తమంగా నిలిచిన సందర్భంగా పోలీస్ సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

also read :-***ఢీల్లీలో చెల్లని రూపాయి కేసీఆర్ : బండిసంజయ్

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలను స్ఫూర్తిదాయకమని వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు. ప్రజలు పోలీసుల్లో భాగమే పోలీసులు ప్రజల్లో భాగమే అనే రీతిలో గుణాత్మకమైన మార్పు తెచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామ‌ని తెలిపారు.

ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉందని ప్రజలు సామరస్యంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా పనిచేస్తూ రాష్ట్రంలో నేరాలు జరగకుండా నియంత్రిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు