Telugu News

*తెలంగాణ పునర్నిర్మాణంలో యువతతే ప్రధాన పాత్ర*

0

*తెలంగాణ పునర్నిర్మాణంలో యువతతే ప్రధాన పాత్ర*

*పువ్వాడ అజయ్ కుమార్*
*రవాణా శాఖ మంత్రి*

తెలంగాణ పునర్నిర్మాణంలో యువతతే ప్రధాన పాత్ర అని రవాణా శాఖ మంత్రి *పువ్వాడ అజయ్ కుమార్* అన్నారు.

*అంతర్జాతీయ యువజన* దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు *చింత నిప్పు కృష్ణ చైతన్య* మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి *పువ్వాడ అజయ్ కుమార్* మాట్లాడుతూ,
ఒక దేశ భవిష్యత్తు యువత పై ఆధారపడి ఉంటుందని,
మీరే ప్రపంచ రథసారథులు, మీ తెలివి మీ ప్రతిభ, ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి అని,అన్నారు.
ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత యువతకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించారని, ముఖ్యంగా యువతను ప్రోత్సహిస్తూ ఇటు పార్లమెంట్ కు ఓటు చట్టసభలకు అవకాశం కల్పించారని, అలాంటి నాయకుడు నాయకత్వంలో పని చేయడం నిజంగా అదృష్టమే అని యువత స్ఫూర్తితో కృషి పట్టుదల ఏకాగ్రత క్రమశిక్షణతతో
మీరు నిర్మించబోయే భవిష్యత్తుకు ముందుగానే అభినందనలు తెలుపుతున్నాను.
ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్
డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహెర,
మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు కమర్తపు మురళి టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మాటేటి కిరణ్ మహమ్మద్ తౌసిఫ్ బాబీ తదితరులు పాల్గొన్నారు.