తెలంగాణ సచివాలయం ఓ చారిత్రాత్మకం
== సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన బాదావత్ లక్ష్మణ్ నాయక్
(కూసుమంచి-విజయంన్యూస్)
దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని, అంబేద్కర్ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అభిమానానికి గొప్ప నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బాదావత్ లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత, బహుజన, గిరిజన బిడ్డలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ ఏర్పడ్డాక ఈరోజు తెలంగాణలో ఏముంది అని అడిగితే కోటి ఎకరాల మాగాణికి నీరు ఉందని, తెలంగాణ ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి ఉన్నదని, ముస్లిం సోదరీమణులకు షాది ముబారక్ ఉన్నదని, వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు అధిక మొత్తంలో పెన్షన్ ఉన్నదని, రైతుబంధు, రైతు భీమా, దళిత బంధు ఉన్నదని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా దేశ మొత్తం బాగుండాలంటే కెసిఆర్ గారు దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం అత్యంత ఆవశ్యకతం. మనమందరం తెలంగాణ బిడ్డలుగా కేసీఆర్ వెంట నిలబడి దేశానికి కావలసిన ఈ సేవలను అందుకోవాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్ పిలుపునిచ్చారు..
allso read- క్రీడాలను ప్రోత్సంహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి శ్రీనివాస్ గౌడ్