Telugu News

తెలంగాణ పాట సిద్దం

రీరికార్డింగ్ దశలో జయ జయహో సాంగ్

0

తెలంగాణ పాట సిద్దం

== రీరికార్డింగ్ దశలో జయ జయహో సాంగ్

== జూన్ 2న పాటను అవిష్కరించనున్న సోనియాగాంధీ 

(హైదరాబాద్ -విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరింది.. తెలంగాణ గీతంగా జయ జయహో తెలంగాణ పాట ఉండగా ఆ పాటను కొన్ని మార్పులు చేర్పులు చేసి నూతనంగా తయారు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల‌ మేరకు

గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి  మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, తదితరులు హాజరయ్యారు. పాటను ఎలా పాడాలి, ఎలాంటి మార్పులు చేయాలనే విషయంపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం లో నిర్ణయించారు. కాగా సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పలు మార్పులు చేర్పులు చేసిన కవి అందెశ్రీ సంగీత దర్శకుడు కీరవాణి తో పాటను పాడించినట్లు తెలిసింది. అయితే ఈ పాటను జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ చేతులు మీదుగా విడుదల చేయాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు సాంగ్ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో కీరవాణి సంగీతం విషయంలో రీరికార్డింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.