Telugu News

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి : ఎమ్మెల్యే పాయం

పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు

0

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి : ఎమ్మెల్యే పాయం

== ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలి..!!

== పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు

(పినపాక-విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని.. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు దశాబ్ది ఉత్సవాలలో పాలు పంచుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  ఒక ప్రకటనలో తెలిపారు.. ఈ సందర్భంగా పాయం  మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నియోజకవర్గంలోని అన్ని మండల గ్రామ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు..!!