Telugu News

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు..:కందాళ

పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి రుణాలు అందాయి

0

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు..:కందాళ

== పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి రుణాలు అందాయి

== సీఎం కేసీఆర్ విజన్ చూస్తుంటే మాకే వణుకు వస్తోంది

== పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

(ఖమ్మంరూరల్/ఖమ్మం-విజయంన్యూస్)

దేశానికే ఆధర్శంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఈ డబ్బుల పంపించవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు పాలేరు నియోజకవర్గం లో నిర్వహించిన తెలంగాణ సంక్షేమ సంబరాలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలని అన్నారు.

ఇది కూడా చదవండి:- కూసుమంచి రామాలయ నిర్మాణానికి కందాళ రూ40లక్షల వితరణ

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ తో కలిసి పాలేరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కలిసి ఎమ్మెల్సీ, అర్హులైన లబ్ధిదారులకు గొర్రెలను, కళ్యాణలక్ష్మీ-షాదీముబారక్ చెక్కులను, Go.No.58,59 ఇండ్ల స్థలాల పట్టాలు, బీసీ బంధు-కుల వృత్తులకు చేయూత యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ:

ఇది కూడా చదవండి:-  వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సృష్టించిన సంపదను రాష్ట్ర ప్రజలందరికీ పంపిణీ చేయాలనే లక్ష్యంతో వందలాది సంక్షేమ పథకాలు రూపొందించి, ముఖ్యమంత్రి కెసిఆర్ సాధ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అభివృద్ధి కల్పిస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని లబ్ధిదారులకు తెలిపారు.

== రాష్ట్ర ప్రగతికి సోపనం : తాతామధు

తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సారాధ్యమే శిరోధాయమని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:- పేదలకు వరం సీఎంఆర్ఎఫ్: తాతామధు

రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత అభివృద్ధి సంక్షేమం దేశానికి దిక్సూచిగా అందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పాలేరు నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కోరారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయని వారు ప్రస్తుతం అధికారంలో ఉండి దేశ సంపదను ప్రైవేటీకరణ చేసే వ్యక్తులు తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి అంధకారంలో నెట్టి వేసేందుకు కుట్రలు పొందుతున్నారని, తెలంగాణ బిడ్డలంగా పాలేరు నియోజకవర్గ ప్రజలంతా చైతన్యవంతులుగా ఆలోచించి పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి వందలాది కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ సహకరిస్తున్న కేసీఆర్ గారికి అఖండ విజయాన్ని అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.