తెల్దారుపల్లిలో ‘రక్తచరిత్ర’
== జెండా పాతితే జీవం పోవాల్సిందే..?
== హత్యలకు నిలయంగా మారిన ఆ పల్లె
== 50ఏండ్ల కాలంలో ఐదు హత్యలు..మూడు హత్యయత్నాలు
== చావుకు చావే కక్ష్యకు పరిష్కారమా..?
== తెల్లారుతున్న జీవితాలు
ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 19(విజయంన్యూస్)
ఏజెన్సీ ప్రాంతం కాదు.. అడవి ప్రాంతం అసలే కాదు.. రాయలసీమా కాదు.. అచ్చం తెలంగాణ రాష్ట్రం.. మైదాన ప్రాంతం.. ఖమ్మం నగరానికి అత్యంత సమీపంలో ఉన్న గ్రామం.. రాజకీయ చైతన్య కల్గిన పల్లె.. ఆ ఊరి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన నేతలు ఉన్నారు.. కానీ ఊరు మాత్రం హత్యలకు నిలయంగా మారింది.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రధాన నేతలేవ్వరు బతికిబట్టకట లేదు.. రాజకీయంగా ఎదుగుతున్నాడంటే ఆయన్ను హత్య చేయడమే ఆ గ్రామంలో అగ్రనేతల పరిస్థితి.. ఇది ఇప్పుడు జరిగింది కాదు.. గడిచిన 50ఏళ్ల నుంచి జరుగుతున్న సంఘటనలు.. ప్రస్తుతం అది అచారంగా మారింది.. 50ఏళ్లలో ఐదు హత్యలు.. మూడు హత్యప్రయత్నాలు.. అయినప్పటికి వెనకాడని నాయకత్వం.. వెనుపోటు కోసం ఎదురుచూసే దొంగచూపులు.. అంతా నమ్మిస్తారు.. అవకాశం దొరికితే నరికేస్తారు.. ఇది ఆ గ్రామంలో ఉన్న పరిస్థితి.. రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని పరిచయం చేసిన ఆ గ్రామం నేడు మోస్ట్ వాంటేడ్ విలేజీగా మారింది.. పోలీస్ బూట్ల చప్పుల నడుమ అమాయక ప్రజలు జీవించాల్సిన పరిస్థితి వస్తోంది..నిత్యం హత్యలతో ఆ తెల్దారుపల్లి రక్త చరిత్రగా మారింది. ఐదేళ్లలో జరిగిన హత్యల గురించి విజయం పత్రిక అందించే విశ్లేషణాత్మక కథనం ఇది..
allso read- పాడే మోసిన తుమ్మల
==చావుకు చావే పరిష్కరమా..?
ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామం రక్తచరిత్రగా మారింది.. గడిచిన 50ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఐదుగురు ప్రధాన నాయకులను హత్య చేశారు. ఒక హత్య జరిగిందంటే, ప్రత్యామ్నయ హత్య జరిగితేనే వాళ్ల కోపం చల్లబడే పరిస్థితి చరిత్ర చెబుతోంది. చావుకు చావే పరిష్కరంలా వారు తయారైయ్యారు. సమస్యను పరిష్కరించుకునే మార్గాలు అనేకంగా ఉన్న కక్ష్యను హత్యలతోనే పరిష్కరించుకుంటున్నారు. జెండా కట్టిన, దిమ్మె కట్టిన, రాజకీయంగా ఎదిగిన వాళ్లను చంపేయడమే పరమావదిగా మారింది. 1971 నుంచి ఆ గ్రామంలో హత్యల రాజకీయాలకు తెరలేపింది. అనాటి నుంచి ఈ నాటి వరకు ఐదు హత్యలు జరగ్గా.. మూడు హత్యాయత్నాలు జరిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.. హత్య జరిగిందంటే మరో హత్య చేయాల్సిందేనన్నట్లుగా అక్కడ పరిస్థితి ఏర్పడింది.. చావుకు చావే పరిష్కరమా..? అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. పరిష్కారానికి అనేక మార్గాలున్నాయని, హత్యల అనంతరం గ్రామంలో శాంతి నేలకొల్పాల్సిన అవసరం ఎంతైన ఉందని సామాన్యులు చెబుతున్నారు. అంతే కాదు గ్రామాల్లో ఉన్న ప్రజలు, విశ్లేషకులు కూడా ఇదే కొరుకుంటున్నారు.
తరువాయి భాగం రేపటి సంచికలో