Telugu News

నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నరు.. తమ్మినేని

సంచలనంగా మారిన వీడియో

0

నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నరు.. తమ్మినేని

== రెండు నెలల ముందే పంచాయతీ ఆఫీస్ వద్ద చెప్పిన తమ్మినేని క్రిష్ణయ్య

== సంచలనంగా మారిన వీడియో

 (ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని క్రిష్ణయ్యకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సంచలనమైంది.. తనను చంపేందుకు సిద్దంగా ఉన్నారని, అందుకు ప్లాన్ చేస్తున్నారని, అయినప్పటికి మీ అండ నాకు ఉంది.. చావుకు బయపడే వ్యక్తిని కాదు.. అంటూ తమ్మినేని క్రిష్ణయ్య పంచాయతీ కార్యాలయం సాక్షిగా అన్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారింది.  గత రెండు నెలల ముందే తన జోస్యం  ప్రజలకు చెప్పాడు.. ఇప్పుడు ఈ వీడియో సంచలనమైంది.. తన జాతకంను తానే ముందుగానే చెప్పుకున్న తమ్మినేని క్రిష్ణయ్య.. ప్రజల అండే నాకు కొండంత అండ అంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఆ వీడియోలో ఏముంది.. ఆయన ఏం మాట్లాడాడు.. ఆ ఊరి గ్రామస్థులకు ఏం చేప్పాడు.. అసలేం జరుగుతోంది..?

ALLSO READ- తెల్దారుపల్లిలో రక్తచరిత్ర..

ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, తెల్దారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత తమ్మినేని క్రిష్ణయ్య ను దుండగులు అతి కిరాతకంగా ఆగస్టు 15న హత్య చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా చేసింది. అత్యంత వేగవంతమైన నేటి యుగంలో రాజకీయ హత్యలు చాలా వరకు తగ్గిపోయాయి. కానీ చాలా రోజుల తరువాత తెల్దారుపల్లిలో రాజకీయ హత్య జరిగింది. దీంతో ఆ ఊరిపై పోలీసులు ద్రుష్టి సారించారు. 144 సెక్షన్ అమలు చేసి ఎక్కడ ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే తెల్దారుపల్లికి సంబంధించిన విషయంలో ప్రతిది కూడా ఒక సంచలనమే అవుతుంది.. హత్య జరిగిన రోజు జరిగిన సంఘటన వివరాలకు, ఆ తరువాత తెలుస్తున్న వివరాలు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య జరిగినట్లు కనిపిస్తున్నప్పటికి ఈ హత్య బెదిరింపులకు సంబంధించిన అంశం కూడా తమ్మినేని క్రిష్ణయ్య ముందుగానే చెప్పడం మరింత అశ్ఛర్యాన్ని కల్గించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పడు సంచలనంగా మారింది. ఈ వీడియోలో ఎమన్నాడంటే..?

ALLSO READ- పాడే మోసిన తుమ్మల

నాకు 75శాతం ఓట్లేశారు.. నన్ను గెలిపించారు. అయిన నన్ను ఊళ్లో తిరగోద్దని అంటున్నారు.. ఇదేక్కడి న్యాయమో మీరే ఆలోచించాలి. నాకు ఓట్లేసింది పనులు చేయడానికి కాదా..? పనులు చేయాలా..వద్దా..? నన్ను వద్దుంటున్నరు..నన్ను చంపుతారంటా..? నన్నుచంపెందుకు ప్లాన్ చేస్తున్నరు.. అయిన నేను వెనక్కి పోను.. మీ అండ నాకు ఉంది..నాకేం కాదు.. చంపుతే చంపడి.. చావడానికి నేను సిద్దంగానే ఉన్నా.. కానీ ఊళ్లో పనులు చేయకుండా ఉండను.  చావంటే భయపడే వ్యక్తిని కాదు.. కానీ మీ అందరికి మేలు చేయడమే నా పని,  పంచాయతీ ఆపీసు వద్ద చెబుతున్నా మీరు నాకు కావాలి. నన్ను చంపుతానంటే చంపనీవ్వండి. చావడానికి నేను సిద్దంగానే ఉన్నాను. మీ అందరి అండ నాకు  ఉంది.. నాకేం కాదు.. బెదిరింపులకు భయపడేవాడ్ని కాదు.. నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడ్నే. నా భార్య తెలంగాణ సాయుద పోరాట యోదుడి కుమార్తే ఆమె మొండిదే. ఎవరికి భయపడం. మీరుంటే చాలు.. మీరు మాత్రం ఎక్కడ గొడవలకు పోకండి. చిల్లర గాళ్లు రెచ్చగొడతారు.. చిల్లర పనులు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. మీరు మాత్రం.. చిల్లరగాళ్ల జోలికి పోవద్దు.. గ్రామాభివద్ది కోసం పనిచేద్దాం.. అడ్డవస్తే రాని.. చూద్దాం.. చంపేస్తే చంపేయని, ఎంత మందిని చంపేస్తారో.. మీ బలం, మీ అండ నాకుంది.. నేను బయపడను.. తల్లిగర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి చావుపై ఆశల పోయినవి. ఇప్పటి వరకు ఎలా పోతాననో నాకే తెలియదు. రాబోయే రోజుల్లో ఎలా చస్తామో తెలియదు.. రోడ్డు యాక్సిడెంట్లో పోవచ్చు.. జబ్బు వచ్చి పోవచ్చు… నన్ను చంపితే చావోచ్చు.. దానికి భయపడేది లేదు.. మీకు ఏపనైనా చేసిపెడతాను.. అంటూ తమ్మినేని క్రిష్ణయ్య చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

== ముందునుంచే స్కెచ్

తమ్మినేని క్రిష్ణయ్యను హత్య చేసేందుకు ముందు నుంచే ప్లాన్ జరుగుతుందా..? ఆయన్ను చంపేస్తామని ఎవరైనా హెచ్చరించారా..? హెచ్చరించిందేవ్వరు..? తెర ముందు ఎవరు..? తెరవెనక ఎవరు..? ఎవరి పాత్ర ఎంతుంది..? అనేది సస్పెన్ష్ గా మిగిలిపోయింది. అయితే తమ్మినేని క్రిష్ణయ్య మాత్రం కచ్చితంగా హత్యలు జరుగుతాయని ముందుగానే ఊహించారు. ఆయన పై ప్లాన్ జరుగుతుందని ముందుగానే ఊహించారు. అందుకే ఆయన అంతమంది జనంలో గ్రామ పంచాయతీ సాక్షిగా ప్రజలకు చెప్పుకున్నాడు. ముందుగానే ప్రజలన్ను పంచాయతీలకు వెళ్లోద్దని చెప్పాడు.. గొడవలు వద్దన్నాడు.. కానీ ఆయన ఊహించిందే అయినప్పటికి, ఇలా చనిపోతాడని ఊహించలేదనుకుంటా..? చూద్దాం తెల్దారుపల్లి గ్రామంలో హత్యరాజకీయాలు ఇక సమిసిపోతాయనే అనుకుందాం..?

== తమ్మినేని క్రిష్ణయ్య ఏమన్నడో.. ఈ కింది వీడియో చూడండి..