అనుచరుడికోసం రోజంతా తెల్దారుపల్లిలో తుమ్మల
కన్నీటి పర్వంతం నడుమ ముగిసిన తమ్మినేని కృష్ణయ్య దశదినకర్మ
అనుచరుడికోసం రోజంతా తెల్దారుపల్లిలో తుమ్మల
== కన్నీటి పర్వంతం నడుమ ముగిసిన తమ్మినేని కృష్ణయ్య దశదినకర్మ
== నివాళ్లు అర్పించిన అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
== నివాళ్ల నుంచి భోజనాల వరకు అక్కడే ఉండి పర్యవేక్షణ
== జనంతో కలిసి భోజనం చేసిన తుమ్మల
== తెల్దారుపల్లిలో కొనసాగుతున్న బందోబస్తు
(రిపోర్టర్: పెండ్ర అంజయ్య)
ఖమ్మంరూరల్,ఆగస్టు 25(విజయంన్యూస్)
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దశదినకర్మ కార్యక్రమం గురువారం చాలా ప్రశాంతంగా ముగిసింది. వేలాధి ప్రజల సమక్షంలో ఆయన దశదిన కర్మ కార్యక్రమం జరిగింది. కన్నీటి పర్వంతం నడుమ దశదినకర్మలు పూర్తైయ్యాయి.. ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందదోబస్తును నిర్వహించారు.
ఇది కూడా చదవండి: సీపీని కలిసిన మాజీ మంత్రి తుమ్మల
ఆగస్టు 15న స్వాతంత్ర్యదినోత్సవం రోజున జెండాను అవిష్కరించి తిరిగి ఇంటికి వస్తున్న ఖమ్మం రూరల్ మండలం, తెల్దారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను ఆ గ్రామానికి చెందిన కొంతమంది దుండగులు అతి కీరాతకంగా హతమార్చారు. మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న తమ్మినేని కృష్ణయ్యను ఆటోతో యాక్సిండెంట్ చేసి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. దీంతో ఈ సంఘటన సంచలనమైంది.. ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అధికారపార్టీకి చెందిన, కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య అనే సమాచారం ఖమ్మం జిల్లా ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేవిధంగా చేసింది. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమై గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. వందలాధి మంది పోలీసులను బందోబస్తుగా నిర్వహించారు. ఇప్పటికి 144 కోనసాగుతూనే ఉంది. కాగా తమ్మినేని కృష్ణయ్యను హత్య చేసిన 8మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
== వందలాధి మంది నివాళ్లు
తమ్మినేని కృష్ణయ్య దశదినకర్మ కార్యక్రమం ఆయన స్వగ్రామం తెల్దారుపల్లిలో కన్నీటి పర్వంతం నడుమ జరిగింది. వేలాధి మంది జనం తరలివచ్చి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. దశదినకర్మ జరుగుతుంటే, విగ్రహాన్ని అవిష్కరిస్తుంటే అక్కడ చూసేందుకు వచ్చిన జనం కన్నీరుమున్నీరైయ్యారు. వేలాధి మంది జనం నివాళ్లు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బోజన శాలకు వెళ్లి ఆయన్ను తలచుకుంటు భోజనాలు చేయడం గమనర్హం.
ఇది కూడా చదవండి: పేదలకు ఎంపీ నామ ఆర్ధిక భరోసా
== విగ్రహాన్ని అవిష్కరించిన తుమ్మల
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన ప్రధాన అనుచరుడైన తమ్మినేని కృష్ణయ్య దశదిన కార్యక్రమం సందర్భంగా ఆయన ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా బావోద్వేగానికి లోనైయ్యారు. కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.. చూసేవారు కూడా కన్నీరుమున్నీరైయ్యారు. కుటుంబ సభ్యులను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓదార్చారు. ఇక దశదిన కార్యక్రమ ఏర్పాట్లను అన్ని తానై దగ్గరుండి పనులను పర్యవేక్షణ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాల వద్దనే ఉంటూ పార్టీ నాయకత్వాన్ని కదిలిస్తూ పనులు చేపట్టారు. తెల్దారుపల్లికి వచ్చే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. వచ్చినవారందరికి భోజనాలు సరపడే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచనలు సలహాలను అందించారు. ఆయన వెంట జిల్లా నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, సాధు రమేష్ రెడ్డి, రామసహాయం వెంకట్ రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, బండిజగదీష్, రమేష్, మాదాసు ఉపేందర్, బొళ్లంపల్లి సుధాకర్ రెడ్డి, కేశవరెడ్డి, ఆశోక్, అర్వపల్లి జనార్థన్, కొండా మహిపాల్, ఆశోక్, హుస్సెన్ తదితరులు ఆయనతోనే ఉన్నారు.
== పోలీసుల భారీ బందోబస్తు
తెల్దారుపల్లి గ్రామంలో తమ్మినేని కృష్ణయ్య దశదిన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు వందలాధి మంది పోలీసులతో తెల్దారుపల్లిలో ప్రతివీధికి పోలీసులు గస్తీకాచారు.అయితే ఎలాంటి చిన్న సంఘటన చోటు చేసుకోకుండా దశదినకర్మ కార్యక్రమం ముగిసింది.