Telugu News

ఆలయ భూములను కాపాడాలి.

ఏన్కూర్ విజయం న్యూస్

0

ఆలయ భూములను కాపాడాలి.

(ఏన్కూర్ విజయం న్యూస్):-

మండల పరిధిలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ భూములను కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఏన్కూరు సొసైటీ అధ్యక్షుడు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, గ్రామస్తులు కోరారు. ఆదివారం ఆయన గార్లఒడ్డు లో విలేకరులతో మాట్లాడుతూ దేవాలయ సమీపంలో భూమిపై తరచూ వివాదం జరుగుతున్నదని దీనిపై రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే చేసి విచారణ జరిపి హద్దులను చూపాలని కోరారు. దేవాలయానికి చెందిన వాడినని చెప్పుకునే ఆ వ్యక్తి దేవాలయ సమీపంలో ఉన్న భూమి నాదేనంటూ దేవాలయం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని దీని గురించి గట్టిగా మాట్లాడే గ్రామస్తులపై తరచు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు.

also read;-అమిత్ షాపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్

దేవాలయ రహదారి నిర్మాణం, షెడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో కూడా అడ్డుపడి వివాదం చేశాడని గతంలో కలెక్టర్ గిరిధర్ దేవాలయ సమీపంలో చిన్న గుట్టను చదును చేయించిన స్థలాన్ని కూడా తమదేనంటూ ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. దేవాలయ భూములను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ భూక్య లాలు నాయక్, మాజీ ఎంపీటీసీ వర శంకర్ ప్రసాద్, గోరింట రమణయ్య, ఆనందరావు,జయరామ్, సత్యం ,నరేష్ ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.