Telugu News

ఖమ్మంలో రైతు భరోసా యాత్రలో ఉద్రిక్తత

పొంగులేటి అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట

0

ఖమ్మంలో రైతు భరోసా యాత్రలో ఉద్రిక్తత

– పొంగులేటి అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట

– కలెక్టరేట్ ఎదుట పొంగులేటి అనుచరులు నిరసన

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతు భరోసా యాత్రలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కలెక్టరేట్ లోపల వెళుతున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఒక్కసారిగా పొంగులేటి అనుచరులు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కొంతమందినే లోపలకు అనుమతించారంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట రైతులు చేతుల్లో మొక్కజొన్న వరి ధాన్యాలతో నిరసన వ్యక్తం చేశారు.కాగా కలెక్టరేట్ వద్దకు భరోసా యాత్ర కు పొంగులేటి పిలుపునివ్వగా ఖమ్మం నగర పోలీసులు ముందుస్తుగానే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ కు వచ్చిన పొంగులేటి వర్గీయులను నివారించారు. దీంతో చాలా సేపు ఉద్రికత్త వాతావరణం నేలకొంది.

ఇది కూడా చదవండి: తక్షణమే అంటే.. ఎన్ని రోజులు: పొంగులేటి