Telugu News

ఖమ్మం సర్కార్ దవఖానలో టెన్షన్..టెన్షన్

== ఆసుపత్రి వద్దకు చేరిన బీజేపీ నేతల ఆందోళన

0

ఖమ్మం సర్కార్ దవఖానలో టెన్షన్..టెన్షన్

== ఆసుపత్రి వద్దకు చేరిన బీజేపీ నేతల ఆందోళన

== వాగ్మూలం తీసుకోవాలని, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్

== ఆసుపత్రి వద్ద బారీ బందోబస్తు

== వాగ్మూలం తీసుకుంటున్న జడ్జీ

(ఖమ్మం-విజయంన్యూస్);-

ఖమ్మం సర్కార్ దవఖానలో ఉద్రిక్తత వాతావరణం నేలకొంది.. బీజేపీ కార్యకర్త సాయిగణేష్ తో వివాహ నిశ్ఛితార్థమైన యువతి విజయ ఆత్మహత్యయత్నం చేసుకోవడం, ఆమెను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకరావడంతో బీజేపీ నేతలు భారీగా ఆసుపత్రికి చేరారు. దీంతో ఆసుపత్రి వద్ద టెన్షన్ టెన్షన్ వాతావరణం నేలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థంకానీ పరిస్థితి నేలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరంలోని చర్చికాంపౌండ్ పరిసర ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఇటీవలే ఆత్మహత్య చేసుకోగా ఆ సంఘటన సంచలనమైంది.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సాయిగణేష్ ఆత్మహత్య సంఘటన చర్చానీయాంశమైంది.

also read :-పాలేరు ఎమ్మెల్యే కందాల ఔదార్యం

బీజేపీ పార్టీకి చెందిన జాతీయ స్థాయి నాయకులు, కేంద్రమంత్రులు, మాజీ మంత్రులు ఖమ్మంలో పర్యటించి టీఆర్ఎస్ ప్రభుత్వంపై, మంత్రి పువ్వాడపై ద్వజమెత్తిన పరిస్థితి చూశాం. కాగా శనివారం సాయిగణేష్ తో వివాహ నిశ్ఛితార్థం చేసుకున్న యువతి విజయ ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా నాయకులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, తక్షణమే జడ్జితో వాగ్మూలం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వద్ద డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో సహా 100 మంది సిబ్బందితో ప్రభుత్వాసుపత్రి వద్ద బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి గొడవ కాకుండా బీజేపీ నాయకులతో పోలీసులు చర్చిస్తున్నారు. కాగా తక్షణమే స్థానిక జడ్జి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి వచ్చి వాగ్మూలం తీసుకున్నారు. అయితే ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వద్ద క్షణంక్షణం ఉత్కంఠగా మారింది.