Telugu News

==తెరాస యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదానం

పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు,

0

==తెరాస యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదానం
== పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు,

===(ఖమ్మం విజయం న్యూస్):-

జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చింతనిప్పు కృష్ణచైతన్య, జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ, కమర్తపు మురళి
తెలంగాణా జాతిపిత, రాష్ట్ర సాధకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుంటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లో గల మాత శిశు కేంద్రం నందు ఖమ్మం తెరాస యువజన విభాగం ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం చేయటం జరిగింది.

also read :-==ఆ ఇద్దరు ఒక్కటైయ్యారు

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణచైతన్య, జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ, కమర్తపు మురళి, నగర యువజన విభాగం అధ్యక్షులు దేవభక్తిని కిశోర్, మంత్రి వ్యక్తిగత సహాయకులు రవికిరణ్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, వలరాజు, స్వర్ణకుమారి ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్  ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర రాజకీయాలోనే కాకుండా దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే విధంగా ఆ భగవంతుడు కేసీఆర్ కి శక్తిని ప్రసాదించాలని అన్నారు

ఈ కార్యక్రమంలో నగర యూత్ ఉపాధ్యక్షులు ఖానపురం హావేలి యూత్ కన్వీనర్ సరిపూడి గోపి సందేశ్, యూత్ జనరల్ సెక్రటరీ 3 టౌన్ కన్వీనర్ మాటేటి కిరణ్, తన్నీరు శోభారాణి, శీలం శ్రీనివాస్, నవీన్ లగడపాటి, విజేత, ఆదిత్య, జగదీష్ మరియు తతిదరులు పాల్గొన్నారు.