Telugu News

నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా..

◆ ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ న‌జ‌ర్‌.

0

నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా..

◆ ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ న‌జ‌ర్‌.

◆మంత్రి పువ్వాడ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు.

◆ ఉల్లంఘ‌న‌ల‌ను అరిక‌ట్టేందుకు రంగంలోకి దిగిన 9 టీంలు.

(ఖమ్మం-విజయం న్యూస్)
ఒకపక్క సంక్రాంతి సీజన్ కావడంతో తెలంగాణ‌-ఆంధ్రప్ర‌దేశ్‌ రాష్ట్రాల మధ్య అందినకాడికి దండుకునే పనిలో ఉన్న‌ ప్రైవేట్ ట్రావెల్స్ వాహ‌న‌దారుల వ్య‌వ‌హారానికి చెక్ పెట్టేందుకు ర‌వాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా, సరైన పర్మిట్లు లేకుండా, ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తూ పొరుగు రాష్ట్రాల మధ్య తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ వాహ‌నాలపై న‌జ‌ర్ పెట్టారు.

ఇప్పటికే హైదరాబాద్ శివార్లలో పలుచోట్ల తనిఖీలను చేపట్టారు. అనేక వాహనాలు పర్మిట్లు లేకుండా, సరైన పాత్రలు లేకుండా, నిబంధనలు విరుద్ధంగా ఉన్న వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.

పండగ సీజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై ఈ మేరకు ర‌వాణా శాఖ అధికారుల దాడులు కొన‌సాగుతున్నాయి.

మోట‌ర్ వేహిక‌ల్ చ‌ట్టం నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తూ తిప్పుతున్న ప్రైవేట్ వాహ‌నాల అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్టేందుకు ప్రత్యేకంగా 9 టీంలు రంగంలోకి దిగిన‌ట్లు ర‌వాణా శాఖ ఉన్న‌తాధికారులు తెలిపారు.

also read :-మేడారం భక్తులకి శుభవార్త

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ట్రావెల్స్ బ‌స్సులు, ప‌ర్మిట్లు లేకుండా న‌డుపుతున్న వాహ‌నాల‌పై దృష్టిసారించి దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు.

ప్రధానంగా ప్రయివేటు వాహ‌నాలు స్టేజి క్యారియర్లుగా న‌డ‌ప‌టం, స‌రియైన‌ పత్రాలు లేకపోవడం వంటి విష‌యాల‌పై ఈ దాడులు కొన‌సాగిస్తూ కేసులు న‌మోదు చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు.

ప్రేవేటు వాహ‌నాల డాక్యుమెంట్లను ప‌క్కాగా చెక్ చేయ‌డం జ‌రుగుతోంద‌ని, అతిక్ర‌మించిన వారిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించ‌బోమ‌ని హెచ్చ‌రించారు.

ఇలాంటి వాహ‌నాల‌లో ప్ర‌యాణించ‌డం కూడా శ్రేయ‌స్సుక‌రం కాద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వ‌హ‌కులు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించ‌డం మంచిది కాద‌ని, మోట‌ర్ వాహ‌నాల చ‌ట్టం లోబ‌డి న‌డుచుకోవాల‌ని అధికారులు కోరారు.