కరీంనగర్ జిల్లా, మానుకొండురూలో ఘోర రోడ్డు ప్రమాదం..
చెట్టును ఢీకొన్న కారు..
నలుగురు ప్రయాణికులు మృతి.. మరొకరికి పరిస్థితి విషమం
ఖమ్మం జిల్లా కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదం..
మృతులంతా కరీంనగర్ జ్యోతి నగర్ వాసులుగా గుర్తింపు.
మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జ్యోతినగర్‌కు చెందిన నివాసులు ఖమ్మం జిల్లా కల్లూరులో జరిగిన దశదిన ఖర్మకు హాజరై తిరిగి వస్తుండగా.. శుక్రవారం తెల్లవారు జామున మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో కారు చెట్టుకు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోవడంతో మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. చనిపోయిన వారిని డ్రైవర్ హిందూరి జలంధర్, కొప్పుల బాలాజీ శ్రీధర్, కొప్పుల శ్రీనివాస రావు, శ్రీరాజ్లుగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన పెంచాల సుధాకర్ రావును కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో సిరిసిల్ల పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు, పెద్దపల్లిలో అడ్వకేట్‌గా పనిచేస్తున్న కొప్పుల బాలాజీ శ్రీధర్లుగా గుర్తించారు. వీరిద్దరు అన్నదమ్ములు కావడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
also read :- చరిత్రలో ఈ రోజు/నవంబరు 26
please subscribe this chanel (https://youtu.be/l1Gvf4gr9Kk)