తుమ్మల ఇంటికి ఠాక్రే
== పార్టీలో చేరికపై చర్చించిన నేతలు
== ఠాక్రే తో పాటు రేవంత్,భట్టి, పొంగులేటి
(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కాంగ్రెస్ అగ్రనేతలు శుక్రవారం కలిచారు. కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్య ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారకమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు మరికొంతమంది నాయకులు హైదరాబాద్ లోని తుమ్మల నివాసానికి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ నెల 17న హైదరాబాద్ లోని తుక్కగూడ లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. అనంతరం రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు.
ఇది కూడా చదవండి:- తుమ్మల చేరికు అప్పుడే..?