Telugu News

ఊరట్టం క్రాస్ స్తూపం వద్ద రోడ్డు ప్రమాదం.

దర్శనంకు వెళ్లి వస్తుండగా ప్రమాదం

0

ఊరట్టం క్రాస్ స్తూపం వద్ద రోడ్డు ప్రమాదం.

== దర్శనంకు వెళ్లి వస్తుండగా ప్రమాదం

తాడ్వాయి-విజయం న్యూస్ ఆగస్ట్ 28:-

ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, ఉరట్టం క్రాస్ స్తూపం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా కొలయిగుడెం గ్రామానికి చెందిన చింటు తో పాటు రాజు, మనోజ్, చందు, రాకేష్ స్నేహితులతో కలిసి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కూరగాయల కోసం కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగి మేడారం వస్తుండగా ఊరట్టం మూల మలుపు దగ్గర కుక్క అడ్డు రావడం వలన ఐ 20 మోడల్ కారు టీఎస్ 01 ఈబీ 9090 నంబర్ గల కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. కారులో బెల్లున్స్ తెరుచుకోవడం వలన ప్రయాణిస్తున్న వారికి ప్రాణ నష్టం ఏమి జరగలేదు. ఒకరికి కాలు విరగాగ మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ములుగు జిల్లా ఆస్పత్రికి ఆటోలో తీసుకెళ్లారు.

allso read- ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు గ్రీన్ సిగ్నల్