*విద్యుత్ షాక్ తో తల్లి కొడుకు మృతి*
*దండపై బట్టలు ఆరేయబోతుండగా విద్యుధాఘాతం
(తల్లాడ -విజయం న్యూస్)
బట్టలు దండమీద అరెసిన తల్లి.. వర్షం రాకతో వాటిని తీసి ఇంట్లో వేసింది.. వర్షం కొంత తగ్గడంతో మరికొన్ని బట్టలను తీసేందుకు ప్రయత్నించగా తల్లి బట్టలు పట్టుకుని గిలగిల కొట్టుకుంటుండటంతో చూసిన కొడుకూ తల్లికేమైందని పట్టుకున్నాడు్. దీంతో ఇద్దరికి విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడే తల్లి, కొడుకు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకీ వెళ్తే
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంకటగిరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు వర్షం రావడం వల్ల తడిసిన బట్టలను ఇంట్లో ఉన్న వైర్ మీద ఆరవేసే సమయంలో పక్కన ఉన్న విద్యుత్ తీగకు ప్రమాదవశాత్తు తగలడంతో తల్లి,కొడుకులు షేక్ సైదా( 25), తల్లి షేక్ నస్ములు అక్కడికక్కడే మృతి చెందారు.
also read:- భట్టి, కమళరాజ్ మధ్య మాటల యుద్ద..సమావేశంలో ఉదృక్తత