Telugu News

గ్యాస్ బండ లోడ్ లారీ బోల్తా.. దగ్గర్లోనే పెట్రోల్ బంక్

తప్పిన పెను ప్రమాదం.. ఊపిరిపిల్చుకున్న స్థానికులు

0

గ్యాస్ బండ లోడ్ లారీ బోల్తా.. దగ్గర్లోనే పెట్రోల్ బంక్

— తప్పిన పెను ప్రమాదం

— ఊపిరిపిల్చుకున్న ప్రజలు 

(తల్లాడ -విజయంన్యూస్)

ఖమ్మం జిల్లా తల్లాడ లోని వైరా రోడ్ లో గ్యాస్ బండలతో వెళుతున్న లారీ పెట్రోల్ బంకు సమీపంలో బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. లారీ బోల్తా పడిన సంఘటనకు కూతవేటు దూరంలో పెట్రోల్ బంకు ఉండడం గ్యాస్ బండలు చెల్లాచెదురుగా పడడంతో అగ్ని ప్రమాదం సంభవిస్తుందని అని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.ఎటువంటి ప్రమాదం సంభవించక పోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.తల్లాడ నుంచి వైరా వెళుతున్న ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.అనేక సార్లు ప్రమాదాలు సంభవిస్తున్నా ఆర్ ఎన్ బి అధికారుల స్పందన కరువైంది. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం సంభవించి ప్రజల ప్రాణాలు పోతున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు జనాలకు దూరంగా పంపించు ప్రమాద స్థలాన్ని పర్యవేక్షించారు. సంఘటనలో గాయపడిన డ్రైవర్,లారీ క్లీనర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ALS0 READ :- చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్