Telugu News

దళితులందరికీ దళిత బందు అమలు చేయాలి: తమ్మినేని

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

0

దళితులందరికీ దళిత బందు అమలు చేయాలి

— రాబోయే రోజులు ఉద్యమ పార్టీలవే.

— బోనకల్లో  జరిగిన సమావేశంలో జోస్యం చెబుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

(బోనకల్ -విజయం న్యూస్)

దళిత బందు పతాకాన్ని రాష్ట్రంలోని దళితులందరికి అందజేయాలని సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. భవిష్యత్ కాలమంతా ఉద్యమ పార్టీలదే అని జోస్యం చెప్పారు. మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో బుధవారం సిపిఎం 8వ మండల మహాసభ నిర్వహించారు.ఈ మహాసభకు అధ్యక్షత వర్గంగా చిట్టిమోదు నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సునీత, గుగులోతు పంతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనకల్ మండలానికి ఉద్యమంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని,ఈ మండలం నుంచి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేకమంది పాల్గొని తమ ప్రాణాలు సైతం అర్పించారన్నారు.ఖమ్మం జిల్లా లో సిపిఎం పార్టీ బలంగా ఉందని ఒక దశలో జెడ్పి చైర్మన్ దక్కించుకునే స్థాయికి ఎదిగిందన్నారు. కానీ లాటరీలో జడ్పీ చైర్మన్ పదవిని కోల్పోయామన్నారు. ఎన్నికలలో డబ్బు రాజ్యం పోతుందని ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చినప్పుడు ఎర్ర జెండా రాజ్యం వస్తుంది అన్నారు.మతోన్మాదాన్ని రెచ్చగొట్టినంత కాలం మాత్రమే బీజేపీ అధికారంలో ఉంటుందన్నారు.దేశవ్యాప్తంగా బీసీ గణన జరగాలని తాము డిమాండ్ చేస్తుంటే, బీజేపీ అందుకు ఒప్పుకోవడం లేదని విమర్శించారు. అలా ఒప్పుకుంటే బీజేపీ పతనం ప్రారంభం అవుతుందనే భయం పట్టుకుంది అన్నారు. ఆంధ్రా నుంచి విడిపోతే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ చెప్పారని కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కడ జరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 ఇది కూడా చదవండి : – రైతుల ఉసురు తీస్తున్న మోడీ : సీపీఎం

కెసిఆర్, నరేంద్ర మోడీ బూటకపు మాయమాటల అని ఎద్దేవా చేశారు.మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 29 చట్టాలను రద్దు చేశారని విమర్శించారు.ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సిపిఎం కార్యకర్తలు, నాయకులు పని చేస్తే మధిర నియోజకవర్గంలో ఎర్ర జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు,రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బండి పద్మ, జిల్లా కమిటీ సభ్యులు మాధినేని రమేష్, చింతలచెరువు కోటేశ్వరరావు, బొంతు రాంబాబు,యనమద్ది సత్యనారాయణ,సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, కూచిపూడి మురళి కృష్ణ, సాదినేని మల్లికార్జున రావు, రామన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.