తమ్మినేని కృష్ణయ్య హత్యపై కేసు నమోదు
== 8మంది నిందితులుగా గుర్తించిన పోలీసులు…?
== ఎఫ్ఐఆర్ నెంబర్ 276/24 పై కేసు నమోదు
ఖమ్మంరూరల్, ఆగస్టు 16(విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో పురోగతి లభించినట్లైంది.. స్వాతంత్రదినోత్సవం రోజున తమ్మినేని కృష్ణయ్య జెండా ఎగరవేసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో తెల్దారుపల్లి గ్రామం వద్ద దుండగులు దారుణాతీదారుణంగా కిరాతంగా హత్య చేయగా, ఆ గ్రామంలో క్షణంక్షణం ఉత్కంఠ నేలకొంది. ఈ తరుణంలో ప్రత్యక్ష సాక్షి మేరకు తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రస్తుతం 8మందితోపాటు మరికొంత మంది అంటూ మంగళవారం కేసు నమోదు చేశారు. ఏ1 ముద్దాయిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు పై కేసు నమోదు చేయగా, ఏ2గా రంజాన్, ఏ3గా జక్కంపూడి కృష్ణ, ఏ4గా గజ్జి కృష్ణ స్వామి, ఏ5గా నూకల లింగయ్య, ఏ6గా బండ నాగేశ్వరరావు, ఏ7గా బోడపట్ల శ్రీను, ఏ8 గా ఎల్లంపల్లి నాగయ్య పేర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం రూరల్ పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే ఇప్పటికి పరారిలోనే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వారందర్ని గాలిస్తున్నామని తెలిపారు. అతి కొద్ది రోజుల్లోనే వారిని పట్టుకుని అరెస్టు చేస్తామని పోలీసులు ఆందోళన కారులకు, బాధిత కుటుంబానికి భరోసానిస్తున్నారు.