Telugu News

పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయం: తమ్మినేని

ముత్తగూడెం సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మినేని వీరభద్రం

0

పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయం: తమ్మినేని

== కమ్యూనిస్టులతో టీఆర్ఎస్  పొత్తు కావాలని భావిస్తుంది

== మనము అదే అనుకుంటున్నాం

== టీడీపీ వచ్చిన కలుపుకపోతం..సీట్లు అన్నుండకపోవచ్చు

== ఈలలేస్తే సరిపోదు.. కష్టపడి పనిచేయాలే

== ముత్తగూడెం సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మినేని వీరభద్రం

(ఖమ్మం రూరల్-విజయంన్యూస్)

పాలేరు నియోజకవర్గంలో ఎర్రజెండా ఎగరడం ఖాయం.. మనం గెలుస్తున్నాం.. ఈలలు కొడితే ఓట్లు రావు.. కష్టపడి పనిచేయాలి.. రాబోయేది మన కాలమే.. మంచి రోజులు ముందున్నాయి.. ఇన్నేళ్ల కష్టానికి ఫలితం రాబోతుంది. అందరు కష్టపడి పనిచేయండి అంటూ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కార్యకర్తలకు సూచించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై  ఆయన మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల వల్ల టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని అందరు అనుకుంటున్నారు.

ఇది కూడ చదవండి: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

అందుకు సంతోషంగా ఉంది. అక్కడ మార్కిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. తద్వారా దేశాన్ని నాశనం చేస్తున్న నరేంద్రమోడీ పార్టీ దారుణంగా ఓడిపోయిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇలాగే పోరు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు ఉండొచ్చు అని అన్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒక్క సీటు కూడా పోకుండా సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ కూటమి గెలుస్తుందని చర్చ జరుగుతోందని, మనమూ కూడా ఆలోచిస్తున్నామని, పొత్తు ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు.  కానీ గతంలో మాదిరి, టీడీపీకి ఒకటీ, రెండు సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉండకపోవచ్చని అన్నారు. వాళ్ళు (టీఆర్ఎస్) చెబుతున్న లెక్కల ప్రకారం పాలేరులో ఎర్ర జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. మనం పోటీ చేసే అవకాశం ఉందని, అందుకు గాను కార్యకర్తలు,  నాయకులు సంసిద్దంగా ఉండాలన్నారు. ఈలలు వేస్తే సరిపోదు.. చాలా కష్టపడాల్సి ఉంటుందని సూచించారు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉందని, కార్యకర్తలు, నాయకులందరు కష్టపడాల్సిన సమయం అసన్నమైందన్నారు. ప్రతి గ్రామాల్లో కార్యకర్తలు ప్రచారం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని సూచించారు. మీ అందరి ఆశీస్సులుంటే కచ్చితంగా మార్కిస్ట్ పార్టీ జెండా పాలేరులో ఎగరడం ఖాయమని అన్నారు.

ఇది కూడ చదవండి: దోపిడిదారుల మూఠాకు  నాయకుడు నరేంద్రమోడీ: కూనంనేని

== చర్చాంశనీయమైన తమ్మినేని వ్యాఖ్యలు

పాలేరు నియోజకవర్గం ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఉన్నారు. మరో వైపు ఆ పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్తున్నారు..  కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.. సీపీఎం పార్టీ కార్యకర్తల బలం ఉంది. ఈ క్రమంలో తమ్మినేని వీరభద్రం ఆదివారం చేసిన సంచలన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఆశీస్తున్న సీటుపై తమ్మినేని కన్నేసినట్లే ఆయన చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. సీపీఎం పార్టీ కచ్చితంగా గెలుస్తోందని, టీఆర్ఎస్ తో పొత్తు వల్ల సీపీఎం కేటాయించే అవకాశం ఉండోచ్చని తమ్మినేని వ్యాఖ్యలు  పాలేరు నియోజకవర్గ గులాబీ గూటిలో కలవరం మొదలైనట్లు కనిపిస్తుంది. మొత్తానికి తమ్మినేని వీరభద్రం లేదా సీపీఎం పార్టీ పాలేరు టిక్కెట్ ను కోరుతున్నట్లే కనిపిస్తున్నారు..? చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో..?