Telugu News

దేశాన్ని నాశనం చేస్తున్న మోడీ!

సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

0

దేశాన్ని నాశనం చేస్తున్న మోడీ!

== దేశ భక్తి ముసుగులో ప్రజలపై భారాలు

== మతోన్మాదుల ఓటమే లక్ష్యం!

==  సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

ఖమ్మం, సెప్టెంబర్ 19(విజయంన్యూస్):

బిజెపి మతోన్మాద,అరాచాక పాలనకు  వ్యతిరేకంగా పోరాడే ప్రగతి శీల, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేయడానికి తాము సిద్దం గా ఉన్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.బిజెపిని ఓడించాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. సోమవారం స్థానిక మంచికంటి హల్ నందు సిపియం రాష్ట్ర కమిటీ సభ్యులు పోన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ పోరాటాన్ని హిందూ -ముస్లీం ఘర్షణ గా వక్రీకరించి ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: అశ్వారావుపేట లో టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు..

మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి తమకు ప్రథమ శత్రువని దాన్ని ఓడించడమే తక్షణ రాజకీయ అవసరమని స్పష్టం చేశారు. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం  చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ బిజెపి ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటికి కేటాయించాల్సిన బడ్జెట్ ను దశలవారీగా తగ్గిస్తూ నష్టాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఉదారంగా అమ్మేస్తున్నారని. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడం కోసమే మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర మంత్రులు రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని కుంటిసాకులు చెప్తున్నారు. కానీ రిజర్వేషన్ల వల్ల ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ దివాలా తీయలేదని ,కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణలో భాగంగా సరళీకరణ, ఆర్థిక విధానాలు మూలంగా సహజవనరులను కారుచౌకగా దారాదత్తం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందన్నారు. ఈ  విధానాలను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని,  ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం  ప్రైవేట్ రంగంలో  రిజర్వేషన్లు అమలు జరపాలని, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పోన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యవర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, కళ్యాణం  వెంకటేశ్వరరావు,  బండి రమేష్, వై విక్రం, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు,చింతల చెర్వు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: వల్లభిలో హత్య