Telugu News

ఖమ్మంకు మెడికల్ కళాశాల మంజూరు పట్ల మమత వైద్య విద్యార్థుల సంబరాలు..

** థ్యాంక్యూ కేసీఆర్ అని కృతజ్ఞతలు.

0

ఖమ్మంకు మెడికల్ కళాశాల మంజూరు పట్ల మమత వైద్య విద్యార్థుల సంబరాలు..

** థ్యాంక్యూ కేసీఆర్ అని కృతజ్ఞతలు.

(ఖమ్మం-విజయం న్యూస్);-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం పట్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం మమత మెడికల్ వైద్య కళాశాల అధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ మమత మెడికల్ కళాశాల అవరణంలో థ్యాంక్యూ కేసీఆర్ అంటూ కళాశాల మొదటి సంవత్సరం వైద్య విద్యార్థినిలు మానవహారంగా ఏర్పడి కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మమత కళాశాల సెక్రటరీ పువ్వాడ జయశ్రీ అధ్వర్యంలో కేక్ ను కట్ చేసి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వైద్య విద్యను ఖమ్మం జిల్లాలో మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన వైద్యం చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రకటించారు.

also read :-రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి…
జై.. కేసీఅర్.. జై అజయ్.. జై తెలంగాణ అంటూ నినాదాలతో కళాశాల ప్రాంగణం హోరెత్తించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పేదలకు సకల సౌకర్యాలతో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే అని, కానీ నేడు జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడంతో పేదవాడికి వైద్యంతో పాటు వైద్య విద్య ను కూడా అభ్యసించే అవకాశం కల్పించడం పట్ల విద్యార్థినిలు హర్షం వ్యక్తం చేశారు.

also read :-తెలంగాణలో మహిళా సాధికారతకే అగ్రతాంబూలం :పొంగులేటి
రానున్న రోజుల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల అందుబాటులోకి రానుండటంతో వైద్య విద్యను అభ్యసించి, సమాజానికి మరింత మంది వైద్యులు అందుబాటులో ఉండబోతాఉన్నారని, తద్వారా మరింత మంది ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలు సులభతరంగా అందుతాయని వైద్య విద్యార్థినిలు అభిప్రాయం వ్యక్తం చేశారు.