Telugu News

నేడు ఖమ్మంకు ‘తారకరామారావు’

నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్న ముగ్గురు మంత్రులు

0

నేడు ఖమ్మంకు ‘తారకరామారావు’

== నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్న ముగ్గురు మంత్రులు

== రూ.1350 కోట్లతో  అభివృద్ది పనులకు శంకుస్థాపన

== మున్నేరు పై ఆర్సీసీసీ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్

== భద్రాచలంగోదావరి పై కరకట్ట విస్తరణ పనులకు శంకుస్థాపన

== సత్తుపల్లిలో ఆయిల్ ఫామ్ ప్యాక్టరీ ప్రారంభోత్సవం

== పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ వి.పి.గౌతమ్, సీపీ

== ఖమ్మం నగరంలో పర్యటనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, సీఎం కేసీఆర్ తనయుడు  కల్వకుంట్ల తారకరామారావు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు రాష్ట్ర రోడ్డుఅండ్ భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్లమెంటరీ పార్టీ నేత నామ  నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యటించనున్నారు.  ఖమ్మం జిల్లాలో రూ.1350 కోట్ల నిధులతో నిర్మాణం చేస్తున్న అభివృద్ది పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేయనున్నారు.

ఇది కూడా చదవండి: భద్రాచలంలో  కాంగ్రెస్ కు భారీ షాక్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు నియోజకవర్గంలో వీరందరు పర్యటించనున్నారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వారు పర్యటించనున్నారు. ఖమ్మం నగరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8గంటలకే పర్యటన ప్రారంభం కానుంది. 7గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో కొణిజర్ల మండలంకు బయలుదేరనున్నారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలను ముగించుకుని, సత్తుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు పాల్గొనున్నారు. రాబోయే ఎన్నికలను ఉద్దేశించి ప్రజలకు మరింత హామిలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పర్యటనను జయప్రదం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు.ఎస్.వారియర్, నగర మేయర్ పూనకొల్లు నీరజ, కమీషనర్ అదర్శ్ సురభీలు ప్రత్యకంగా చొరవ తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు పర్యటిస్తున్న ప్రాంతాల్లో అత్యంత వేగంగా రోడ్డు పనులు చేస్తున్నారు.

== మున్నేరుకు శాశ్వత పరిష్కారం..

ఖమ్మం నగరంలో ఉన్న మున్నేరుకు  వరదలు వచ్చినప్పుడల్లా టెన్షన్ వాతావరణం కనిపిస్తుంటుంది.. వరదలు వచ్చాయంటే మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు భయాందోళన చెందాల్సిందే.. వరద పెరుగుతుంటే గగ్గొలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. మరింత పెరిగితే ఇళ్లు, వాకిలి మొత్తం వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వస్తోంది.. తద్వారా అస్తినష్టం, ప్రాణనష్టం చూడాల్సి వస్తుంది..ఈ ఏడాది అత్యంత భారీగా 30 అడుగలకు పైగా వరదలు రావడంతో ముంపు ప్రాంతాలు మొత్తం నీటిమయం అయ్యాయి.. ఒక్క ప్రాణనష్టం జరిగింది..

ఇది కూడా చదవండి: అమిత్ షాపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్

వందల సంఖ్యలో ప్రజలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి రక్షించారు. ప్రతిసారి ముంపు ప్రాంత ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. ఆ పరిస్థితి నుంచి రక్షించించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శాశ్వత పరిష్కార మార్గాలను ఆలోచించారు. మున్నేరుకు భద్రాచలం గోదావరికి కట్టినట్లుగా శాశ్వతంగా కరకట్ట నిర్మాణం చేస్తే బాగుంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ద్రుష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకరించారు. రూ1000 కోట్లను విడుదల చేస్తూ క్యాబినెట్ మీటింగ్ లో ప్రకటించి, అమోదింపజేశారు. మున్నేరుకు ఇరువైపుల ఆర్సీసీసీ వాల్ నిర్మాణం చేసే విధంగా నిధులు మంజూరు చేయగా, ఈ వాల్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో మున్నేరు ముంపు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి జైజైలు పలుకుతున్నారు.

== మున్నేరుపై తీగల వంతెన కు శంకుస్థాపన

మూడు రాష్ట్రాలకు అనుసంధానమైన రహదారి హైదరాబాద్ టూ అశ్వరరావుపేట వయా ఖమ్మం. ఈ రహదారిలో ఖమ్మం నగరానికి చేరుకునేందుకు మున్నేరు వంతెనను దాటి రావాల్సి ఉంటుంది. అయితే మున్నేరు పై వంతెన నిర్మాణం చేసి ఏళ్లు గడుస్తుండగా వంతెన ప్రమాదంలోకి వెళ్లింది.. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో ఆర్అండ్ బీ అధికారులు బైపాస్ లో వంతెనను నిర్మాణం చేశారు. అయితే ఖమ్మం నగరానికి భారీగా వాహనాల తాకడికి పెరగడంతో మరో వంతెన అవసరమని భావించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరీంనగర్, సిద్దిపేటలో నిర్మాణం చేసినట్లుగా తీగల వంతెనను నిర్మాణం చేయాలని భావించారు. ఈ మేరకు ప్రభుత్వం తీగల వంతెనను మంజూరు చేశారు. ఆ తీగల వంతెనకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపనలు చేయనున్నారు.

 

 

 

== ఖమ్మంలో అభివృద్దిపనులకు శంకుస్థాపన

ఖమ్మం నగరం సుందరీకరణ జరుగుతోంది.. ఇప్పటికే అనేక రహదారులను నిర్మాణం చేసి, లకారం, గోళ్లపాడు చానల్ సుందరీకరణ చేసి ఖమ్మంప్రజలతో షెబాస్ అనిపించుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మరో అద్భుత పనులకు శ్రీకారం చుట్టారు. ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో నిధులు మంజూరు చేయించిన మంత్రి పువ్వాడ, మరో రూ.1000 కోట్లను మంజూరు చేయించి అదుర్శ్ అనిపించారు. దీంతో ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మాణం చేయిస్తున్నారు. ఖమ్మం నగరంలో భారీగా నీధులు మంజూరు చేసిన పురపాలక మంత్రి కె.తారాకరామారావు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం చరిత్రను అసెంబ్లీలో చూపించి ఖమ్మం గొప్పతనాన్ని చూపించిన ఏకైక ప్రాజెక్ట్ ఖమ్మంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్.   ఈ మార్కెట్ పోటోలను మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చూపించి ఖమ్మం అభివద్దిని కొనియాడారు. అలాంటి వెజ్ అండ్ మార్కెట్ ను మంత్రి పువ్వాడ శనివారం ప్రారంభించనున్నారు.

== నేరవేరనున్న భద్రాద్రి ప్రజల చిరకాల కోరిక

ప్రతి ఏడాది భద్రాచలంలోని గోదావరి ఉగ్రరూపం మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఏడాది 60అడుగులకు పైగా వరద ప్రవాహం వస్తుండటంతో గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది 70.35 అడుగులకుపైగా వరదా మహోగ్రరూపం చూపించగా, భద్రాచలంను వరద చుట్టుముట్టేసింది.. వాస్తవంగా భద్రాచలంలో నిర్మాణం చేసిన కరకట్ట భద్రాచలం కొట్టుకపోకుండా కాపాడిందనే చెప్పాలి. కానీ చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ గ్రామాలు పూర్తిగా నీటమునిగి కోట్ల రూపాయల అస్తి నష్టం జరిగింది..

ఇది కూడా చదవండి: ఖమ్మంలో  పోస్టర్ వార్ ..

గిరిజనులు జీవితాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్పించారు. గతేడాది కూడా 60అడుగలకు పైగా వరదలు వచ్చాయి. లోతట్లు ప్రాంత ప్రజలందర్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. అయితే గోదావరి పై ఉన్న కరకట్టను విస్తరించాలనే డిమాండ్ పెరిగింది. ప్రజలు ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను,  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను డిమాండ్ చేశారు. విస్తరణ చేయాలని సీఎం కేసీఆర్ కు వినతి చేయడంతో స్పందించిన సీఎం కేసీఆర్ గతేడాది రూ.1000 కోట్లను ప్రకటించారు. భద్రాచలంలో గోదావరి నదిపై కరకట్టను విస్తరించేందుకు నిధులు మంజూరు చేసినట్లు సీఎం ప్రకటించారు. అయితే ఆ నిధులు విడుదల చేయడంలో కొంత జాప్యం కావడంతో ఈ ఏడాది వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం విమ్మర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు, యువకులు నెటిజన్లు ప్రశ్నలు సందించారు. ఈ సమయంలో ఖమ్మంలో పర్యటించిన సీఎం కేసీఆర్ భద్రాచలంలో కరకట్టను విస్తరించడం ఖాయమన్నారు. దీంతో నెలల వ్యవధిలోనే నిధులు విడుదల చేయగా, శనివారం మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోని అనకట్టు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం అభివృద్దే  లక్ష్యం: మంత్రి