Telugu News

ఆ నలుగురు అరెస్ట్..

* రామకృష్ణ సూసైడ్ కేసులో పురోగతి..

0

ఆ నలుగురు అరెస్ట్..
** రామకృష్ణ సూసైడ్ కేసులో పురోగతి..
** పోలీసుల అదుపులో నలుగురు..? రహస్య ప్రదేశంలో విచారణ
(భద్రాద్రికొత్తగూడెం-విజయంన్యూస్);-
రామకృష్ణ ఆత్మహత్యకేసులో భద్రాద్రికొత్తగూడెం పోలీసులు పురోగతి సాధించినట్లుగా తెలుస్తోంది.. రామకృష్ణ భూమికి సంబంధించిన పంచాయతీ విషయంలో పాల్గొని బాగస్వాములైన ఆ నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.. వారిని ఓ రహస్య ప్రాంతంలో ఏర్పాటు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.. కేసు సంబంధించిన విషయంలో అనుమానితులుగా ఉన్న ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు వనమా రాఘవతో అనేక సెటిల్‌మెంట్‌లలో భాగస్వాములయ్యారని గుర్తించినట్లు తెలుస్తోంది.

also read :-రైతులకు అండగా ఎమ్మెల్యే కందాల..

కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనేక సెటిల్‌మెంట్‌లలో రాఘవతో భాగస్వాములయ్యారని, రామకృష్ణ పంచాయతీ జరిగినప్పుడు కూడా ఈ నలుగురు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
** ఆనలుగురిపై మస్తుగా అభియోగాలు..?
కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న ఈ నలుగురు వ్యక్తులపై ఇప్పటికే అనేక అభియోగాలున్నాయి. అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు 15 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసినట్లు ప్రచారం జరుగుతుంది. పంచాయతీ జరిగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని అందులో స్పష్టంగా పేర్కొనడంతో పోలీసులు ఆ దిశగా కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.

also read :-వనమా ఇంటికి భారీ పోలీస్ బందోబస్తు
** సెటిల్‌మెంట్లు.. బ్లాక్‌ దందాలే వీరి పని..?
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నలుగురిలో ఒకరు రేషన్‌ బియ్యం రీ పాలిష్‌ దందాలో కీలక వ్యక్తి. దీంతోపాటు మరో వ్యక్తి లిక్కర్‌ సిండికెట్‌ మాఫియాలో కిలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు మరో ఇద్దరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రామకృష్ణ సూసైడ్‌ నోట్‌ ఆధారంగా వీరిని రెండు రోజుల నుంచి విచారణ కొనసాగించినున్నట్లు సమాచారం.