Telugu News

దళితులకు దక్కిన ఆ భూమి

== జుజ్జులరావుపేటలోని భూవివాదంలో తేల్చి చెప్పిన తహసీల్దార్ == మట్టితొలేందుకు అనుమతి లేదని నిరాకరించిన శిరీషా == విజయం కథనానికి స్పందించిన తహసీల్దార్, అధికారులు == ‘విజయం తెలుగు దినపత్రిక’కు ధన్యవాదాలు తెలిపిన బాధిత దళితులు

0

దళితులకు దక్కిన ఆ భూమి
== జుజ్జులరావుపేటలోని భూవివాదంలో తేల్చి చెప్పిన తహసీల్దార్
== మట్టితొలేందుకు అనుమతి లేదని నిరాకరించిన శిరీషా
== విజయం కథనానికి స్పందించిన తహసీల్దార్, అధికారులు
== ‘విజయం తెలుగు దినపత్రిక’కు ధన్యవాదాలు తెలిపిన బాధిత దళితులు

(కూసుమంచి – విజయంన్యూస్) :-
కూసుమంచి మండలంలోని జుజ్జులరావుపేట గ్రామానికి చెందిన దళితులకు పంచాయతీలో ఉన్న భూమి దక్కింది.. గత మూడు రోజుల క్రితంగా హైవే నిర్మాణ కాంట్రాక్టర్ కు, దళితులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. మా భూమి అంటూ దళితులు మొత్తుకుంటుంటే, మాకు ప్రభుత్వాధికారులు మట్టి తోలేందుకు అనుమతులిచ్చారని, కచ్చితంగా మట్టి తోలేందుకు సిద్దంగా ఉన్నామని తెల్చిచెబుతున్నారు.

మట్టి ఎలా తీసుకెళ్తారో చూస్తామని బాధిత దళితులు అడ్డుపడుతుండటంతో సమాచారం అందుకు విజయం తెలుగు దినపత్రిక ప్రతినిధి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను తీసుకుని గురువారం ‘గిదేంది సారూ..? మా పొట్టకొట్టకుండ్రీ..మాకు న్యాయం చేయండ్రీ’ అంటూ వార్త కథనాన్ని ప్రచురితం చేశారు. దీంతో స్పందించిన కూసుమంచి తహసీల్దార్ శిరీషా పాత రికార్డులను పరిశీలించారు.

ఈ మేరకు జుజ్జులరావుపేట గ్రామంలోని మాదిగ కుంటభూమి నూటికి నూరు శాతం బాధిత దళితులకు చెందిందేనని, 4.12 ఎకరాల భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు వారి వద్ద ఉండటం, రికార్డుల్లో కూడా వాళ్ల పేర్లనే చూపించడంతో తహసీల్దార్ శిరీషా తెల్చి చెప్పారు. కచ్చితంగా వారి హక్కుగల భూమి అది అని, అందులో హైవే కాంట్రాక్టర్లు అడుగు పెట్టేది లేదన్నారు.

also read :- తెలంగాణ వడ్లు కొనల్సిందే.. తేల్చుకునే వస్తాం.. మంత్రి పువ్వాడ.

also read :-తుమ్మలకు అడుగడుగున నిరాజనం

దీంతో ఆ కుంట వద్దకు వచ్చిన జేసీబీ, టిప్పర్లన్ని వెనక్కి వెళ్లిపోయాయి. కాగా బాధిత దళితులు తహసీల్దార్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే దళిత పక్షాన నిలిచి మంచి వార్త కథనాలను రాసి అధికారులకు తెలిసే విధంగా చేసి సహాకరించి, మాకు న్యాయం చేయించిన ‘విజయం’ తెలుగు దినపత్రిక ప్రతినిధి పెండ్ర అంజయ్యకు, క్యూ న్యూస్ విలేకరి కొండా శ్రీనివాస్ రావుకు, సీకె న్యూస్ ప్రతినిది భూక్యా ఉపేందర్ కు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కథనాలవల్ల ప్రజల్లో జర్నలిస్టులపై నమ్మకం, గౌరవం పెరుగుతున్నారు.