ఆ పార్టీ నాకు దైవం : పొంగులేటి
** తెరాస లోనే కొనసాగుతా
** పార్టీ మారుతాననే వస్తున్న వార్తలు అవాస్తవం
**ప్రజాభిమానమే నా బలం.. బలహీనత
**మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
**ముదిగొండలో పలు కుటుంబాలకు పరామర్శ
(ఖమ్మంప్రతినిధి, ముదిగొండ-విజయంన్యూస్)
గత కొంతకాలంగా తాను తెరాస పార్టీని విడిచి వేరే పార్టీకి వెళ్తునాననే వస్తున్న వార్తలు అవాస్తం అని తెరాసలోనే తన రాజకీయ భవిష్యత్తు కొనసాగుతుందని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శు క్రవారం ముదిగొండ మండలంలో పలు కుటుంబాలను పరామమర్శించి, బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనపై ప్రజలు చూపిస్తున్న అభిమానమే తన బలం బలహీనత అని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం తన రాజకీయ భవిష్యత్తుకు ధోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. చిరుమర్రిలో కొడాలి కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించారు. వనంవారి కిష్టాపురంలో పూలూరి దినేష్ కుమార్ ఇటీవల చనిపోగా అతని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
also read :-కాంగ్రెస్ దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్
బాణాపురంలో ఇటీవల వత్సవాయి గోపాళం చనిపోగా అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వల్లభిలో కొడాలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా పెద్దమండవలో పలు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. -శీనన్న వెంట కదిలొచ్చిన జనసైన్యం..! – శీనన్న వెంట జన సైన్యం కదిలొచ్చింది. ఖమ్మంలో పొంగులేటి శీనన్న పర్యటన మొదలుకొని ముదిగొండలో పర్యటన ముగిసేంత వరకు పార్టీ కార్యకర్తలు… శీనన్న అభిమానులు సైన్యంలా కదిలొచ్చారు. సుమారు 20కి పైగా కాన్వాయ్ లు శీనన్న పర్యటన ఆసాంతం అనుసరిస్తు వెళ్లాయి. ప్రత్యేకించి ముదిగొండ మండలంలోని గ్రామాల్లో ఏ గ్రామ గడప తొక్కిన శీనన్న వెంట సుమారు 200మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు ఆయన్ను అనుసరిస్తు వెంట వచ్చారు. తనపై అమితమైన జనాదరణ చూసిన పొంగులేటి శీనన్న ప్రజాభిమానమే నా బలం.. బలహీనత అనే విషయం ఈ పర్యటన ద్వారా మరోమారు రుజువైందని పేర్కొన్నారు. రెట్టించిన ఉత్సాహంతో శీనన్న తన పర్యటనను కొనసాగిస్తూ బాధిత కుటుంబాలను ఓదారుస్తు ముందుకు సాగారు.
also read :-★ కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రబడ్జెట్
పొంగులేటి వెంట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ పీటీసీ పసుపులేటి దుర్గా-వెంకట్, జిల్లా నాయకులు డాక్టర్ కోట రాంబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మీగడ శ్రీనివాస్ యాదవ్, మండల నాయకులు దేవరపల్లి అనంతరెడ్డి, ముదిగొండ సర్పంచ్ మందవరపు లక్ష్మీ-వెంకన్న, మండల బీసీ సెల్ అధ్యక్షులు తోట ధర్మారావు, ఏఎంసీ డైరెక్టర్ బంక మల్లయ్య, వెంకటాపురం సర్పంచ్ అనంతరాములు,
మోర్తాల నాగార్జున్ రెడ్డి, కమలాపురం ఎంపీటీసీ ఆదినారాయణరెడ్డి, గంధశిరి సర్పంచ్ సీతమ్మ- వెంకటేశ్వర్లు, బాణాపురం ఎంపీటీసీ పచ్చా సీతారామయ్య, సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండ స్వామి, వట్టికూటి సైదులు, గ్రామ శాఖ అధ్యక్షులు రామారావు, జోలకంటి సంజీవరెడ్డి, గోకినపల్లి ఎంపీటీసీ, ఉపసర్పంచ్, యడవల్లి ఎంపీటీసీ చెరుకుపల్లి బిక్షం, ఉపసర్పంచ్ పాషా, నర్సయ్య, రాంప్రసాద్, లక్ష్మీపురం ఎడ్లీ రఫీ, చిరుమర్రి వెంకన్న ప్రసాద్, దారా రాము, ఉ పసర్పంచ్ రమేష్, సువార్ణాపురం యూత్ అధ్యక్షులు ప్రేమ్, కటకూరు మాజీ సర్పంచ్ కొమ్ము ఉపేందర్, జిల్లా శ్రీను, రమేష్ ఆర్ఎంపీ, ముదిగొండ లడ్డా, క్రిష్టాపురం బత్తుల వెంకటరావు, మల్లన్నపాలెం మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, పమ్మి ఏలూరి హనుమంతరావు, గ్రామశాఖ అధ్యక్షులు పంజాల రాజేష్, వల్లాపురం నాగరాజు, ఉప సర్పంచ్ అలసాని వెంకన్న, వాజే వెంకటేశ్వరరెడ్డి, దేవరపల్లి రమణారెడ్డి, ఉపసర్పంచ్ దేవరపల్లి రాఘవరెడ్డి, పోట్ల బాబు, నర్సింహారావు, చురుకు నర్సింహారావు, వల్లభి కొడారి వెంకటేశ్వర్లు, కొండా రామారావు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ ధనమూర్తి, మల్లారం రమేష్, పెద్ద మండవ లంకెల బ్రహ్మారెడ్డి, లంకెల మోహన్ రెడ్డి, సర్పంచ్, ఉపసర్పంచ్, కనగాలి వెంకటేశ్వర్లు, ఈశ్వర్, మరికంటి కృష్ణ, మేడేపల్లి కొత్తపల్లి వెంకటేశ్వర్లు, రెడ్డిమల్ల సత్యనారాయణరెడ్డి, కనక ముత్తయ్య, మేడే యల్లయ్య, ఆముదాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.