తెలంగాణ యువ శక్తిని మేల్కొల్పడమే లక్ష్యం: పువ్వాళ్ళ
విలేకరుల సమావేశంలో జిల్లా,నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, జావిద్
తెలంగాణ యువ శక్తిని మేల్కొల్పడమే లక్ష్యం: పువ్వాళ్ళ
*👉🏻జూన్ 2న రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలు*
*👉🏻రిజిస్ట్రేషన్ కు ఆఖరు తేదీ జూన్ 1*
*👉🏻విలేకరుల సమావేశంలో జిల్లా,నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, జావిద్
(ఖమ్మం-విజయం న్యూస్)
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువ శక్తిని మేల్కొల్పడమే లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేఖరుల సమావేశంలో పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ…
ఇదికూడా చదవండి:-సంభానిని కలిసిన జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ
8వ తారీఖున హైదరాబాద్ సరూర్ నగర్ నిరుద్యోగ నిరసన సభలో ప్రియాంక గాంధీ ప్రకటించిన సంచలనాత్మకమైన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేల్కొల్పే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని అన్నారు. అందులో భాగంగా జూన్ 2వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందుకుగాను ఔత్సాహికులు, ఆశక్తి గల యువత 7661899899 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ఆన్లైన్ పరీక్షకు జూన్ 1వ తారీకు వరకు అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
*కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు :*
ఇది కూడా చదవండి:- డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ని సన్మానించినా జావిద్
1. తెలంగాణ యువత మేధో సామర్థ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సాహించడం
2. తెలంగాణ యువత తమ జనరల్ నాలెడ్జిని మెరుగుపరుచుకునేలా, పరిధిని దాటి విభిన్నంగా ఆలోచించేలా వీలు కల్పించడం
3. సాంప్రదాయక విద్యా విధానాల పరిధి దాటి యువత ఆలోచించేలా ఒక వేదికను అందించడం
4. భారతీయ చరిత్ర, తెలంగాణ చరిత్ర,తెలంగాణ ఉద్యమం మరియు వర్తమాన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించడం
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పీసీసీ సభ్యులు మహ్మద్ జావేద్,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ లు మాట్లాడుతూ..
ఇది కూడా చదవండి:- ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి:కాంగ్రెస్
*సిలబస్:*
1. జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్
2. భారత దేశ చరిత్ర మరియు స్వాతంత్ర ఉద్యమం
3. తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమం
4. భారతదేశ అభివృద్ధి ప్రణాళికలు మరియు విధానాలు
5.జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్
నిరుద్యోగ యువత, ఆసక్తి గల 16 నుండి 35 ఏండ్ల లోపు ఉన్న అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని క్విజ్ పోటీలో పాల్గొనాలని కోరారు. ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా విజేతలకు మొదటి మూడు బహుమతులు 1)ల్యాప్ టాప్ 2)స్మార్ట్ ఫోన్ 3)ట్యాబ్ లెట్ లతో పాటు 40 ప్రోత్సాహక బహుమతులు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లోని ఒక మహిళా టాపర్ కు ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేయనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి:- తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే: పువ్వాళ్ళ
ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటి కార్యనిర్వాహాక అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి,జిల్లా మైనారిటి అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,జిల్లా SC సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,ఖమ్మం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్,కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు,మలీదు వెంకటేశ్వర్లు,పల్లెబోయిన భారతి చంద్రం,ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి కుమార్, మద్ది వీరారెడ్డి,బచ్చలకూర నాగరాజు,కైజర్ తదితర నాయకులు పాల్గొన్నారు.