Telugu News

ప్రజలకు మేలు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం

0

ప్రజలకు మేలు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం
 రైతుల కోసం ఎందాకైనా పోడానికి సిద్దం
 కేంద్రం రైతులను నట్టెట ముంచేందుకు సిద్దమైంది
 రైతుబంధు పథకం కిందా రూ.50,600 కోట్లు రైతులు ఖాతాలో జమ చేసినం
 ప్రతి ఏటా వ్యవసాయానుబంధ రంగాల కోసం రూ.60వేల కోట్లను ఖర్చు చేస్తున్నాం
 ప్రతి నీటిబొట్టులో సీఎం కేసీఆర్ ఉంటారు : మంత్రి పువ్వాడ
 రైతుబంధు పథకం చారీత్రాత్మక విజయం: నామా
సత్తుపల్లి నియోజకవర్గం నారాయణపురంలో ఘనంగా రైతుబంధు సంబురోత్సవం
 హాజరైన మంత్రులు నిరంజన్ రెడ్డి, అజయ్ కుమార్, ఎంపీ నామా, మాజీ మంత్రి తుమ్మల, నేతలు, ప్రజాప్రతినిధులు
(ఖమ్మం ప్రతినిధి,సత్తుపల్లి-విజయంన్యూస్):-

రాష్ట్ర ప్రజలందరికి మేలు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆయన ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, అనేక పథకాలను తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయనుబంధ రంగాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు సంబరాల్లో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో సోమవారం జరిగిన రైతుబంధు సంబరోత్సవాలలో రాష్ట్ర మంత్రులు ఎస్.నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

also read :-సంబరంగా రైతుబంధు ఉత్సవాలు..

ఈ సందర్భంగా రైతులనుద్దేశించి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగే ప్రతి పథకంలో ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకు ఎల్లప్పుడు కనిపిస్తుంటారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగష్టు 15 న శ్రీకారం చుట్టిన రైతుబంధు ఎనిమిది విడతలలో ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద రూ.50,600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు, వివిధ ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లు, రైతు భీమా కోసం ప్రతి సంవత్సరం రూ.1450 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ప్రతి ఏటా సగటున రూ.60 వేల కోట్ల రూపాయలను వ్యవసాయానుబంధ రంగాలపై మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రణాళికబద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని మంత్రి అన్నారు.

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల పట్ల దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు 15 నెలల పాటు పోరాటం చేసి విజయం సాధించారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులు ఇప్పటికే విశేష పంట మార్పిడి అలవర్చుకొని ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గుచూపుతున్నారని, రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు జిల్లాలో నూతన ఫ్యాక్టరీ ఏర్పాట్లు, కనీస మద్దత్తు ధర అంశాలు పరిశీలనలో ఉన్నాయని వ్యవసాయ శాఖా మంత్రి తెలిపారు. ఆధునాతన పద్ధతులలో వేంసూరులో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గౌరవ ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తేవడం జరిగిందని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా వైవిధ్యమైన పంటలకు ప్రత్యేకత కలిగి ఉందని, సత్తుపల్లి నియోజకవర్గ రైతుల పంటల సాగు విధానాలను తెలియపర్చేందుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి సుమారు 5, 6 వేల మంది రైతులను క్షేత్రపర్యటనకు పంపించినట్లు మంత్రి తెలిపారు. ఈ సీజన్ కు సంబంధించి 5 వందల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగుకు అవసరమైన మొక్కలను అందించడం జరుగుతుందని, వానాకాలం సీజన్లో మూడున్నర లక్షల నుండి 5 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

also read;-కూరగాయలతో కేసీఆర్ చిత్రపటం
మొలకెత్తే ప్రతి మొలకలో సీఎం కేసీఆర్ ఉన్నారు : మంత్రి పువ్వాడ
రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యతనిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మొలకెత్తే ప్రతి మొలకలో, మొలకెత్తిన ప్రతి గింజలో, పారే నీళ్లలో, ప్రతి నీటి బొట్టులో ప్రతిచోట ముఖ్యమంత్రివర్యులు ప్రజలకు కనిపిస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దేశ చరిత్రలోనే వ్యవసాయం కోసం సహాయం చేసే ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అని మంత్రి అన్నారు. 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్తు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకే దక్కిందని, రైతులు సెల్ ఫోన్ ద్వారా నీటి మోటార్లు ఆన్ చేసుకుంటున్నారని మంత్రి అన్నారు.

also read :-నేడు వామన అవతారంలో దర్శనమిస్తున్న

సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ రైతుబంధు సంబరాలను పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో ప్రారంభించుకొని నేడు రాష్ట్ర మంత్రుల సమక్షంలో సత్తుపల్లి మండలం నారాయణ పురంలో నిర్వహించుకుంటున్నామని నియోజకవర్గ రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత తెలిపే విధంగా నవధాన్యాలతో ఎకరం విస్తీర్ణంలో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని తీర్చిదిద్దడం జరిగిందని ఆయన తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో రూ.1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, రైతుబంధు కింద 80 వేల మంది రైతులకు రూ. 470 కోట్లు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. రైతుబంధు ఉత్సవాలలో భాగంగా నియోజకవర్గంలో 40 పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం పోటీలను నిర్వహించి విజేతలకు నగదు బహుమతులను అందించామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పామాయిల్ సాగుకు వెయ్యి ఎకరాలకు పైగా మొక్కల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని వేంసూరులో నూతన పామాయిల్ ఫ్యాక్టరీకి అనుమతి కావాలని వ్యవసాయ శాఖా మంత్రిని ఆయన కోరారు.

also read :-దేవుడి కాళ్ళవద్ద మనిషి తల

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుబంధు పెట్టుబడి సాయం 50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేయడం చారిత్రాత్మకమని, తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత ఏడేళ్ళ కాలంలో వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించామని గతంలో కరెంటు, సాగునీరు, నిధులు సక్రమంగా లేక తెలంగాణ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇబ్బందులన్నీ తొలిగి రైతులందరూ ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయంతో వ్యవసాయం చేసుకుంటున్నారని నామా నాగేశ్వరరావు అన్నారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ట్రాలు అవలంభించేందుకు ముందుకొస్తున్నాయని, రైతుబంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన అన్నారు.

రాబోయో రోజుల్లో ఫామాయిల్ సాగు జీవనాధారం కాబోతుందని, ఫామాయిల్ రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసుకునేందుకు కనీస మద్దతు ధర 15 వేల రూపాయలుగా నిర్ణయించాలని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు తాతా మధుసూధన్, మాజీ శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జడ్పీ.టి.సి పోసంపూడి రామారావు, ఎం.పి.పి హైమావతి, సర్పంచ్ రంగారెడ్డి, ఎం.పి.టి.సి కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయనిర్మల, జిల్లా సహాకరా శాఖాధికారి విజయకుమారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

please subscribe this chanel smiling chaithu