అనుచరుడుని పరామర్శించిన సంభాని
== ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి
(తిరుమలాయపాలెం-విజయంన్యూస్)
ఉమ్మడి ఖమ్మంజిల్లా సంభాని యువసేన అధ్యక్షులు షేక్ నజీర్ తండ్రి సంభాని ప్రధాన అనుచరుడు షేక్ కరీం కి ఇటీవల శస్త్రచికిత్స జరుగగా బుధవారం తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలోని వారి స్వగృహానికి మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ వెళ్లి పరామర్శించి, ఆరోగ్య విషయంలో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జడ్పీటీసీల సంఘం అధ్యక్షుడు, జడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్, స్టేట్ ఎస్సీసెల్ కన్వీనర్ కొండూరు కిరణ్, షేక్ గోరెమియా షేక్.నజీర్., పోతురాజు నరేంద్ర షేక్.సైదా. తదితరులు.ఉన్నారు
ఇది కూడా చదవండి: ప్రజల జీవితాలను నాశనం చేసింది బీజేపీ: సంభాని