Telugu News

జీళ్ళచెరువు వద్ద కారు అదుపు తప్పి బోల్తా

వ్యక్తి మృతి..కేసు నమోదు

0

జీళ్ళచెరువు వద్ద కారు అదుపు తప్పి బోల్తా

== వ్యక్తి మృతి..కేసు నమోదు

(కూసుమంచి -విజయం న్యూస్)

గేదెను తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా కొట్టి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన జీళ్ళచెరువు లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై కూసుమంచి మండలం జీళ్ళచెరువు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఖమ్మం నగరంలోని పోలీస్ హౌసింగ్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు(50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గేదె అడ్డు కావడంతో తప్పించబోయి డివైడర్ కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.