తెలంగాణలో వరి పండించే రైతులపై కేంద్రం వివక్ష వీడాలి
—-యాసంగి వడ్లు కొనాల్సిందే
—-మండల కేంద్రంలో టి ఆర్ యస్ శ్రేణుల దీక్ష
—-నిరసనలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య
(వాజేడు విజయం న్యూస్):-
తెలంగాణలో పండించే యాసంగి వడ్లను కొనబోమని కేంద్రం భీష్మించుకుని కూర్చుండడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, రాష్ట్ర రైతులకు మద్దతుగా నిలవాలని రాష్ట్ర మంత్రి, టి ఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మండలంలో టిఆర్ఎస్ నాయకులు, గులాబీ శ్రేణులు నిరసన దీక్షలో భారీగా పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, యాసంగి దాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రతి రోజూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
also read;-రైతు నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా…..
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్ర రైతాంగానికి మేలు చేసే వరకు విశ్రమించేది లేదన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, జడ్పిటిసి తల్లడి పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద, మండల కార్యదర్శి సోమిడి నరసింహారావు, టిఆర్ఎస్ నాయకులు గొడుగులూరి మోహన్ రావు, యగ్గడి అంజయ్య, చెన్నం ఎల్లయ్య, లొట్టపెట్టెల రాంబాబు, పోలూరి వేణుగోపాల్, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.